Last Updated:

Coconut Water: కొబ్బరి నీళ్లతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా.. ఈ సమస్యలతో బాధపడేవారు జాగ్రత్త!

Coconut Water: కొబ్బరి నీళ్లతో ఆరోగ్య ప్రయోజనాలే కాదు సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా.. ఈ సమస్యలతో బాధపడేవారు జాగ్రత్త!

Coconut Water Side Effects: వేసవి కాలం వచ్చేస్తోంది. ఈ కాలంలో శరీరం తొందరగా డీ హైడ్రేట్‌ అవుతుంది. దీంతో శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచుకునేందుకు చాలా మంది కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. ఈ కొబ్బరి నీళ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని విషయం అందరికి తెలిసిందే. ఆరోగ్యానికి మాత్రమే కాదు, అందానికి కూడా ఇవి బాగా ఉపయోగపడతాయి. రోజు కొబ్బరి నీళ్లు తాగడం వల్ల శరీరానికి మంచి పోషకాలు అందుతాయి. కొబ్బరిలో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి బలాన్ని ఇస్తామి. అంతేకాదు శరీరంలో నీటి శాతాన్ని కూడా బ్యాలెన్స్‌ చేయడంలో ఇవి అద్భుతంగా పని చేస్తాయి. ఆరోగ్యానికి మేలు చేసే కొబ్బరి నీళ్ల వల్ల కూడా సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉంటాయనే విషయం మీకు తెలుసా? ఏంటి షాక్‌ అవుతున్నారా? అవును మీరు విన్నది నిజమే? కొబ్బరి అతిగా తాగడం వల్ల ఎన్నో సైడ్‌ ఎఫెక్ట్స్‌ ఉన్నాయట. ముఖ్యంగా ఇలాంటి ఆరోగ్య సమస్యలతో బాధపడేవారు కొబ్బరు నీళ్లు ఎక్కువగా తీసుకుంటే ప్రాణానికే ముప్పు అని అంటున్నారు నిపుణులు. మరి అదేంటో? ఎలాంటి వారు కొబ్బరి నీళ్లు ఎక్కువ తాగకూడదో ఇక్కడ చూద్దాం!

కిడ్నీ సంబంధిత సమస్యలు

కొబ్బరి నీళ్లులో పొటాషియం చాలా ఎక్కువ ఉంటుంది. ఒక కొబ్బరికాయలో దాదాపు 600 మి.గ్రా పొటాషియం ఉంటుందట. పొటాషియం శరీరానికి అవసరమే కానీ, ఎక్కువ మోతాదులో ఉంటే మాత్రం ఆరోగ్య సమస్యలు ఎదురవుతామి. ముఖ్యంగా కిడ్నీ సమస్యలతో బాధపడే వారు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగకూడదట. ఈ సమస్యతో బాధపడేవారి శరీరంలో మూత్రపిండాల పనితీరు తక్కువ ఉంటుందనే విషయం తెలిసిందే. అలాంటప్పుడు అవి పొటాషియంను సరిగా ఫిల్టర్‌ చేయలేవు. దానివల్ల హైపర్‌కలేమియా(రక్తంలో పొటాషియం అధికంగా ఉండటం) సమస్య వస్తుంది. దీనివల్ల కండరాల బలహీనత, హృదయ స్పందనలో హెచ్చు తగ్గులు ఉండే అవకాశం. దీని తీవ్రత ఎక్కువ ఉంటే కొన్ని సందర్భాల్లో గుండెపోటు వచ్చే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు కొబ్బరి నీళ్లు పరిమితిలో తీసుకోవాలి.

మధుమేహం

సాధారణంగా కొబ్బరి నీళ్లలో సహజంగానే చక్కెర ఉంటుంది. నీరు చాలా రుచిగా ఉ ంటాయి. అయితే చక్కర మధుమేహ వ్యాధిగ్రస్తులకు మంచిది కాదు. కాబట్టి ఈ వ్యాధిగ్రస్తులు కొబ్బరి నీళ్లు అధికంగా తీసుకోకుడదు. పరిమితిలోనే తాగాలి. వేసవి కాలం వచ్చిందని హైడ్రేషన్‌ కోసం ఈ కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగారంటే మీ రక్తంలో చక్కెర స్థాయిలో పెరిగి అనారోగ్యానికి గురవుతారు.

తక్కువ రక్తపోటు

కొబ్బరి నీళ్లలో శరీరానికి కూలింగ్‌ని ఇస్తుంది. ఈ నీళ్లలో రక్తపోటు తగ్గించే లక్షణాలు ఎక్కవుగా ఉంటాయి. అందుకు అధిక రక్తపోటు ఉన్నవాళ్లు కొబ్బరి నీళ్లు ఎక్కువ తాగడం వల్ల మంచి ఫలితాలను చూస్తారు. అదే రక్తపోటు తక్కువగా ఉన్నారు కొబ్బరి నీళ్లు తరచూ తాగడం వల్ల అనారోగ్య సమస్యలు చూస్తారు. ఎందుకంటే వారి రక్తపోటు మరింత తగ్గి తలతీరగడం. అలసటగా అనిపించడం వంటి ఎదురవుతాయి. ఈ సమస్య ఎక్కువగా ఉంటే మూర్చ వంటి సమస్యలు కూడా వస్తాయి.

కడుపు సంబంధిత సమస్యలు

కొబ్బరి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల ప్రకోప ప్రేగు సిండ్రోమ్‌ లేద అల్సరేటివ్‌ కొలిటిస్‌ వంటి కడుపు సమస్యలు వస్తాయి. ఈ సమస్యలు ఉన్నవాళ్లు కొబ్బరి నీటిని తక్కువగా తీసుకోవాలి. ఇందులో ఉండే ఫైబర్‌ కొంతమంది జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.

శస్త్ర చికిత్స ముందు అసలు తాగకండి!

ఏదైన శస్త్రచికిత్స చేయించుకునే కొన్ని రోజుల ముందు నుంచి కొబ్బరి నీళ్లను తాగకూడదట. కొబ్బరి నీళ్లలో ఉండే ఎలక్ట్రోలైట్స్, మినరల్స్‌, శరీరం యొక్క రక్తపోటు.. ఎలక్ట్రోలైట్‌ బ్యాలెన్స్‌ను ప్రభావితం చేస్తాయి. ఇది శస్త్రచికత్స సమయంలో కానీ, ఆ తర్వాత సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి శస్త్ర చికిత్స చేయించుకునే కొన్ని రోజుల ముందు నుంచి కొబ్బరి నీళ్లు తీసుకోకపోడమే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: