Bandi Sanjay comments: కిషన్‌రెడ్డిని అయినా ప్రశాంతంగా పనిచేయనివ్వండి.. బండి సంజయ్
తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు నేతలనుద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధిష్టానానికి తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దని చురకలంటించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

Bandi Sanjay comments: తెలంగాణ బీజేపీ మాజీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీలో కొందరు నేతలనుద్దేశించి తీవ్ర విమర్శలు చేశారు. పార్టీ అధిష్టానానికి తప్పుడు రిపోర్టులు ఇవ్వొద్దని చురకలంటించారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన మీద ఫిర్యాదు చేస్తే చేశారేమో కానీ.. కిషన్ రెడ్డిపై ఫిర్యాదు చేయొద్దన్నారు. పార్టీ సిద్దాంతాలను నమ్ముకుని చేరిన కార్యకర్తలు, నేతల నమ్మకాన్ని వమ్ము చేయవద్దని సంజయ్ కోరారు. పదే పదే ఢిల్లీకి వెళ్లి ఫిర్యాదులు చేయొద్దన్నారు. కిషన్ రెడ్డినైనా ప్రశాంతంగా పని చేసుకోనివ్వాలన్నారు.
బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేసాను..(Bandi Sanjay comments)
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డి బాధ్యతల స్వీకరణ సందర్భంగా కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి భావోద్వేగానికి గురయ్యారు. బండి సంజయ్‌ని చూసి కళ్లలో నీళ్లు తిరిగాయని.. తట్టుకోలేక బాత్‌రూమ్‌లోకి వెళ్లి ఏడ్చేసినట్లు తెలిపారు. తెలంగాణలో బీజేపీకి జోష్ రావడానికి కారణం బండి సంజయ్ మాత్రమేనని వెల్లడించారు. బండి సంజయ్ మరింత ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. బండి సంజయ్‌ను గుండెల్లో పెట్టుకోవాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కేంద్రమంత్రి కిషన్ రెడ్డి శుక్రవారం నాంపల్లిలోని రాష్ట్ర కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా పలువురు బీజేపీ నాయకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
- Weather Alert: దంచికొట్టనున్న అత్యంత భారీ వర్షాలు.. ఇంటి నుంచి బయటకు రావద్దు.. తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ డేంజర్ వార్నింగ్
- Project-K: చీకటిని చీల్చుతూ పుట్టుకొచ్చిన “కల్కి”.. గూస్ బంప్స్ తెప్పిస్తున్న “ప్రాజెక్ట్-K గ్లింప్స్”