Last Updated:

AP Riots: ఏపీలో కొనసాగుతున్న అల్లర్లు.. దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్న ఏపీ..

ఒకప్పుడు అల్లర్లు అంటే బిహార్, యూపీ గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఏపీలో అంతకుమించి విధ్వంసంకాండ జరుగుతోంది. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, ఆళ్లగడ్డ, ఏలూరులో టీడీపీ, వైసీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులు, కత్తులు, రాళ్లతో దాడులు చేసుకుంటున్నారు. తలలు పగిలినా, కాళ్లు చేతులు విరిగినా తగ్గట్లేదు.

AP Riots: ఏపీలో కొనసాగుతున్న అల్లర్లు.. దాడులు, ప్రతిదాడులతో అట్టుడుకుతున్న ఏపీ..

AP Riots: ఒకప్పుడు అల్లర్లు అంటే బిహార్, యూపీ గుర్తొచ్చేవి. కానీ ఇప్పుడు ఏపీలో అంతకుమించి విధ్వంసంకాండ జరుగుతోంది. పల్నాడు, తిరుపతి, తాడిపత్రి, ఆళ్లగడ్డ, ఏలూరులో టీడీపీ, వైసీపీ శ్రేణులు పెట్రోల్ బాంబులు, కత్తులు, రాళ్లతో దాడులు చేసుకుంటున్నారు. తలలు పగిలినా, కాళ్లు చేతులు విరిగినా తగ్గట్లేదు. ఎన్నికలు జరిగి 48గంటలు గడుస్తున్నా గొడవలు మాత్రం తగ్గడం లేదు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని అందరు భయాభ్రాంతులతో గడుపుతున్నారు.

పల్నాడు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ..(AP Riots)

పల్నాడు జిల్లా గొడవలతో అట్టుడుకుతుంది. దీంతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు 144 సెక్షన్ విధించారు. పరిస్థితిని అదుపుచేసేందుకు కేంద్రబలగాలను రంగంలోకి దింపారు. నరసరావుపేట లోక్‌సభతో పాటు నరసరావుపేట, వినుకొండ, సత్తెనపల్లి, పెదకూరపాడు, గురజాల, మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గాల్లో తిరిగి ఆదేశాలు జారీచేసే వరకు 144 సెక్షన్‌ అమల్లో ఉంటుందని ప్రకటించారు. ఇక నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, టీడీపీ అభ్యర్థి అరవింద్ బాబును హౌస్ అరెస్ట్ చేశారు. ఇద్దరి ఇళ్ళ వద్ద పోలీసుల భారీగా మోహరించారు. ఇద్దరి ఇళ్ళ దారిలో బారికేడ్ల ఏర్పాటు చేసి రాకపోకలను నిలిపివేశారు.

పల్నాడు జిల్లా వ్యాస్తంగా.. నిన్న రాత్రి నుంచి అదనపు బలగాలు మోహరిస్తున్నా.. పరిస్థితి ఇంకా అదుపులోకి రావడం లేదు. దాంతో ఇవాళ మళ్లి కేంద్ర బలగాలను ఈసీ రంగంలోకి దింపింది. అడుగడుగునా పోలీసులను మోహరించింది. మరోవైపు రాజకీయ నాయకులను ఎక్కడికక్కడ పోలీసులు హౌస్ అరెస్టులు చేశారు. గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డితో పాటు, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి, ఆయన సోదరుడిని పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. పల్నాడు జిల్లాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న ప్రాంతాన్ని పోలీసులు తమ అధీనంలోకి తీసుకున్నారు. మరోవైపు మాచర్లలోకి కొత్త వారిని అనుమతించడం లేదు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించి నగరంలోకి అనుమతిస్తున్నారు. మాచర్లలో భారీకేట్లను పెట్టి తనికీలు చేస్తున్నారు. ఇక దాచేపల్లి మండలం మాదనిపాడులో ఉద్రిక్తత కొనసాగుతుండటంతో.. అధికారులు అదనపు బలగాలను చేరవేశారు.

తాడిపత్రిలో హైటెన్షన్ ..

అనంతపురం జిల్లా తాడిపత్రిలో హైటెన్షన్ నెలకొంది. వైసీపీ.. టీడీపీ వర్గాల దాడులతో యుద్ధభూమిగా మారిన తాడిపత్రి భయంతో బిక్కుబిక్కుమంటోంది. దాడులపై సీరియస్ అయిన జిల్లా ఎస్పీ కేంద్రబలగాలను రంగంలోకి దించారు. ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి.. అలాగే జేసీ ప్రభాకర్ రెడ్డి ఇండ్లకు వెళ్లే రోడ్లను బ్లాక్ చేశారు. ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని వేర్వేరు ప్రాంతాలకు తరలించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అఖిల ప్రియ బాడీ గాడ్ నిఖిల్‌పై అర్ధరాత్రి దాడి జరిగింది. దాడిని గమనించిన స్థానికులు బాధితుడిని చికిత్స కోసం హుటా హుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం నిఖిల్ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. ఏవీ సుబ్బారెడ్డి అనుచరులే హత్యాయత్నానికి పాల్పడ్డారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

 డోన్ లో ఉద్రిక్తత..

నంద్యాల జిల్లా డోన్ లో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. టీడీపీ నేత సుధాకర్ అరెస్ట్‌కు నిరసనగా టీడీపీ నేతలు నిరసనలకు పిలుపునిచ్చారు. దాంతో విషయం తెలుసుకున్న పోలీసులు మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇంటి వద్ద భారీగా బందో బస్తు ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 144 సెక్షన్ అమలులో ఉండటం వల్ల.. నిరసనలకు పర్మీషన్ లేదని నిరాకరించారు. కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి ఇంటి వద్దకు భారీగా కోట్ల అభిమానులు, టీడీపీ కార్యకర్తలు భారీగా చేరుకుంటుండంటంతో అధికారులు అలెర్ట్ అయ్యారు. టీడీపీ కార్యకర్తలను ఎక్కడికక్కడ నిలిపివేస్తున్నారు.