Last Updated:

Indonesia Floods: ఇండోనేషియాలో వరదలు.. 37 మంది మృతి

ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోఆకస్మిక వరదలు సంభవించడంతో సుమారుగా 37 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. వరదల కారణంగా 100 కు పైగా ఇళ్లు, భవనాలు కొట్టుకుపోయాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్ద ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.

Indonesia Floods: ఇండోనేషియాలో వరదలు.. 37 మంది మృతి

Indonesia Floods: ఇండోనేషియాలోని సుమత్రా ద్వీపంలోఆకస్మిక వరదలు సంభవించడంతో సుమారుగా 37 మంది మరణించగా పలువురు గల్లంతయ్యారు. వరదల కారణంగా 100 కు పైగా ఇళ్లు, భవనాలు కొట్టుకుపోయాయని జాతీయ విపత్తు నిర్వహణ సంస్ద ప్రతినిధి అబ్దుల్ ముహారి తెలిపారు.

18 మంది గల్లంతు..(Indonesia Floods)

రెస్క్యూ సిబ్బంది అగామ్ జిల్లాలోని కండువాంగ్ గ్రామంలో 19 మృతదేహాలను బయటకు తీశారు. పొరుగున ఉన్న తనహ్ దాతర్‌లో మరో తొమ్మిది మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు నేషనల్ సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది.పదాంగ్ పరిమాన్‌లో ఎనిమిది మృతదేహాలను, పదాంగ్ పంజాంగ్ నగరంలో ఒక మృతదేహం లభించిందని ఏజెన్సీ తెలిపింది. తప్పిపోయిన 18 మంది కోసం వెతుకుతున్నట్లు తెలిపింది. ఆకస్మిక వరదల కారణంగా తానా దాతర్ జిల్లాలోని అనై వ్యాలీ జలపాతం చుట్టూ ఉన్న ప్రధాన రహదారులు బురదతో మూసుకుపోయాయని, ఇతర నగరాలకు రాకపోకలు నిలిచిపోయాయని పదాంగ్ పంజాంగ్ పోలీస్ చీఫ్ కార్త్యానా పుత్ర ఆదివారం తెలిపారు.భారీ వర్షాల కారణంగా పశ్చిమ సుమత్రాలోని పెసిసిర్ సెలాటాన్, పడాంగ్ పరిమాన్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు మరియు విరిగిపడటంతో 21 మంది మరణించగా ఐదుగురు తప్పిపోయారు.