MLC Bye-Election: ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు కొనసాగుతున్న పోలింగ్
ఖమ్మం-నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్హ కొనసాగుతోంది. పట్ట భద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి.. సాయంత్రం 4 గంటల వరకు ఈసీ అవకాశం కల్పించింది.
MLC Bye-Election: ఖమ్మం-నల్గొండ- వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు పోలింగ్ కొనసాగుతోంది. పట్ట భద్రులు తమ ఓటు హక్కు వినియోగించుకోవడానికి.. సాయంత్రం 4 గంటల వరకు ఈసీ అవకాశం కల్పించింది. ఎన్నికలు ముగిసిన తర్వాత.. జూన్ 5న నల్లగొండలో ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. ఈ ఉప ఎన్నికలో 4లక్షల,63వేల, 839 మంది పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 2లక్షల, 88వేల,189 మంది పురుషులు, లక్షా,75వేల,645 మంది మహిళలు, ఐదుగురు ట్రాన్స్‌జెండర్లు ఉన్నారు. పట్టభద్రుల కోసం మొత్తంగా 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు.
ఒక్కో పోలింగ్ కేంద్రంలో 800 మంది..(MLC Bye-Election)
ఒక్కో పోలింగ్ కేంద్రంలో సగటున 800 మంది ఓటు హక్కు వినియోగించుకునేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. ఈ ఉప ఎన్నిక కోసం 3 వేల మంది సిబ్బందిని ఈసీ రంగంలోకి దింపింది. ఈ ఎన్నికల్లో 52 మంది అభ్యర్థులు పోటీపడుతున్నారు. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నుంచి ఏనుగుల రాకేష్ రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా పాలకూరి అశోక్‌కుమార్ తదితరులు పోటీలో నిలిచారు.పోలింగ్ సందర్భంగా కొన్ని చోట్ల స్వల్ప సంఘటనలు చోటుచేసుకున్నాయి. సోమవారం ఉదయం నార్కట్‌పల్లిలో స్వతంత్ర అభ్యర్థి అశోక్‌గౌడ్‌పై కాంగ్రెస్ నాయకులు దాడి చేశారు. ఓ ఫంక్షన్ హాల్‌లో పట్టభద్రుల ఓటర్లకు డబ్బులు పంచుతుండగా అశోక్ గౌడ్ అడ్డుకోవడంతో పాటు మొబైల్ ఫోన్‌లో రికార్డు చేసేందుకు ప్రయత్నించాడు. ఆయన ఫోన్ డ్యామేజ్ చేయడమే కాకుండా కాంగ్రెస్ నేతలు. అతనిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం నార్కట్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కాంగ్రెస్ నాయకులపై అశోక్‌గౌడ్ తదితరులు ఫిర్యాదు చేసారు.ఉదయం 10 గంటల వరకు దాదాపు 11.34 శాతం పోలింగ్ నమోదైంది.