Last Updated:

Janasena Pawan Kalyan : ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

దేశ ప్రజలతో మమేకం కావలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రతీ నెల చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రేడియో ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడంతో పాటు.. దేశంలో పలువురు ప్రముఖుల గురించి

Janasena Pawan Kalyan : ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలిపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్..

Janasena Pawan Kalyan : దేశ ప్రజలతో మమేకం కావలనే ఉద్దేశంతో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ప్రతీ నెల చివరి ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ రేడియో ద్వారా దేశ ప్రజలతో తన మనసులోని మాటను పంచుకుంటారు. కేంద్ర ప్రభుత్వ పనితీరును ప్రజలకు వివరించడంతో పాటు.. దేశంలో పలువురు ప్రముఖుల గురించి, ప్రదేశాల గురించి, సామాన్యుల విజయాల గురించి ప్రస్తావిస్తుంటారు ప్రధాని. ఈ నేపథ్యంలోనే మన్‌ కీ బాత్‌ కార్యక్రమం తాజాగా 100వ ఎపిసోడ్‌కు చేరువైంది. ఈ తరుణంలో పలువురు ప్రముఖులు మోదీకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా మోదీకి విషెస్ చెబుతూ ఒక వీడియో ని రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 85 జిల్లాల్లో 91 చోట్ల 100 వాట్ల సామర్థ్యం గల ఎఫ్‌ఎం రేడియో ట్రాన్స్‌మిటర్లను ప్రారంభించారు. రూ.100 కాయిన్ను కూడా విడుదల చేయనున్నారు. అలాగే, అనేక అంశాలపై కీలక ప్రసంగం చేయనున్నారు. ఫలితంగా ఆకాశవాణి ట్రాన్స్‌మిటర్ల సంఖ్య 524 నుంచి 615కు చేరింది. ఈ అదనపు సౌకర్యాల కల్పనతో ఆకాశవాణి కార్యక్రమాలు దేశవ్యాప్తంగా మొత్తం 73.5% జనాభాకు అందుబాటులోకి వస్తాయి. కొత్త ట్రాన్స్‌మిటర్లతో ఆకాశవాణి కార్యక్రమాలను కొత్తగా 2 కోట్ల మంది వినడానికి వీలవుతుంది. రేడియో కార్యక్రమాల విస్తృతి 35 వేల చదరపు కిలోమీటర్ల మేర పెరుగుతుంది.

అదే విధంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. అన్ని గ్రామాలకూ ఆప్టికల్‌ ఫైబర్‌ సౌకర్యం అందుబాటులోకి తెచ్చి అత్యంత చౌకగా డేటా లభ్యమయ్యేలా చూస్తామని, దానివల్ల సమాచారం సులభంగా అందుబాటులోకి వస్తుందన్నారు. మన్‌ కీ బాత్‌ కార్యక్రమం ద్వారా దేశ ప్రజలతో నాకు భావోద్వేగ సంబంధం ఏర్పడింది. ఇందుకు రేడియోనే కారణం. కాబట్టి, ఒక విధంగా నేనూ మీ ఆలిండియా రేడియో బృందంలో ఒకణ్నే’’ అని మోదీ తెలిపారు.