MLA Rajasingh: అక్బరుద్దీన్ ఓవైసీ ప్రొటెం స్పీకర్‌గా ఉంటే నేను ప్రమాణ స్వీకారం చేయను.. ఎమ్మెల్యే రాజాసింగ్
తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్యేగా ఎన్నికైన అక్బరుద్దీన్ ఓవైసీనిఎంపిక చేశారు. ఇప్పటి వరకూ అక్బరుద్దీన్ 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేపు జరగబోయే అసెంబ్లీలో ఆయన కొత్త గా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.

MLA Rajasingh:తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా ఆల్ ఇండియా మజ్లిస్-ఏ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) ఎమ్మెల్యేగా ఎన్నికైన అక్బరుద్దీన్ ఓవైసీనిఎంపిక చేశారు. ఇప్పటి వరకూ అక్బరుద్దీన్ 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రేపు జరగబోయే అసెంబ్లీలో ఆయన కొత్త గా ఎన్నికైన ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. రేపటి నుంచి 4 రోజుల పాటు తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.
స్పీకర్ వచ్చాకే..(MLA Rajasingh)
అయితే అక్బరుద్దీన్ ప్రొటెం స్పీకర్ అయితే తాను ప్రమాణ స్వీకారం చేయనని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. పూర్తి స్దాయి స్పీకర్ బాధ్యతలు చేపట్టాక తాను ఎమ్మెల్యేగా ప్రమాణస్వీకారం చేస్తానని చెప్పారు. రాజాసింగ్ ఒవైసీ సోదరులపై తరచుగా విరుచుకుపడుతుంటారు. ఎన్నికలముందు కూడా ఓవైసీ సోదరులకు దమ్ముంటే గోషామహల్ నుంచి తనపై పోటీ చేయాలని సవాల్ చేసారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తరువాత కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్నెల్లు, లేదా ఏడాది మాత్రమే ఉంటుందని తరువాత వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని రాజాసింగ్ పేర్కొన్నారు.భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర శాఖ శుక్రవారం పార్టీ ఫ్లోర్ లీడర్‌ను నిర్ణయించే అవకాశం ఉంది. గోషామహల్ నుంచి ఎన్నికైన టి.రాజా సింగ్, నిర్మల్ నుంచి ఎన్నికైన అల్లెటి మహేశ్వర్ రెడ్డి దీనికి రేసులో ఉన్నారు. మరి పార్టీ పెద్దలు ఎవరివైపు మొగ్గు చూపుతారో చూడాలి.
ఇవి కూడా చదవండి:
- Farooq Abdullah: నాతండ్రిని నెహ్రూ జైల్లో పెట్టినా ఆయనపై కోపం లేదు.. ఫరూక్ అబ్దుల్లా
- Janasena chief Pawan Kalyan: మార్పు కోసమే ఓట్లు అడుగుతాను.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్