Last Updated:

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టైమింగ్స్ పొడగింపు

Hyderabad Metro: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. టైమింగ్స్ పొడగింపు

Hyderabad Metro Timings Change: హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు శుభవార్త. మెట్రో సమయం పొడిగించేందుకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం రాత్రి 11 గంటల వరకే అందుబాటులో ఉండే మెట్రో సేవల సమయం పెరిగింది. ఇకపై రాత్రి 11.45 గంటల వరకు మెట్రో నడవనుంది. ఈ నిబంధనలు ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్నాయని మెట్రో ఎండీ ఎన్‌వీఎస్ రెడ్డి వెల్లడించారు. ఈ సేవలు సోమవారం నుంచి శుక్రవారం వరకు మాత్రమే అందుబాటులోకి రానున్నాయి. టెర్మినల్ స్టేషన్ల నుంచి ఆదివానం తొలి రైలు ఉదయం 7 గంటలకు ప్రారంభం కానుంది.

 

దీంతో పాటు సూపర్ సేవర్ హాలిడే ఆఫర్‌ను కూడా ఏడాది పొడిగించింది. సూపర్ సేవర్ హాలిడే ఆఫర్, ఆఫ్ పీక్ వేళల్లో స్మార్ట్ కార్డులపై ఇచ్చే తగ్గింపు ఆఫర్ ఏప్రిల్ 2024లో ప్రారంభమైంది. ఈ ఆఫర్ మార్చి 31తో ముగియనుంది. తాజాగా, ఈ ఆఫర్‌ను సైతం హైదరాబాద్ మెట్రో మరో ఏడాది పొడగిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఆఫర్ 2026 మార్చి 31 వరకు అందుబాటులో ఉండనుందని మెట్రో తెలిపింది. కాగా, ఈ ఆఫర్‌తో 20 ట్రిప్పులకు డబ్బులు చెల్లించి 30 ట్రిప్పులు ప్రయాణించేలా అవకాశం కల్పించారు.