Last Updated:

BC Vidya Nidhi Scheme: గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. ఏప్రిల్ 1 నుంచి బీసీ విద్యానిధికి దరఖాస్తులు!

BC Vidya Nidhi Scheme: గుడ్ న్యూస్ చెప్పిన సర్కార్.. ఏప్రిల్ 1 నుంచి బీసీ విద్యానిధికి దరఖాస్తులు!

Telangana BC Vidya Nidhi Scheme From April 1: తెలంగాణ విద్యార్థులకు రాష్ట్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఉన్నత విద్య చదివేందుకు బీసీ విద్యార్థులకు కీలక ప్రకటన చేసింది. ఇందులో భాగంగానే మహాత్మా జ్యోతిబాఫులే బీసీ విదేశీ విద్యానిధి పథకం కింద విదేశాల్లో ఉన్నత విద్య కోసం అర్హులైన బీసీ, ఈబీసీ అభ్యర్థుల నుంచి బీసీ సంక్షేమ శాఖ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది.

 

కాగా, అభ్యర్థులు డిగ్రీలో 60శాతం మార్కులతోపాటు ఈ ఏడాది జులై 1 నాటికి 35 ఏల్లోపు వయసు ఉన్న వారు అర్హులని పేర్కొన్నారు. అలాగే కుటుంబ వార్షికాదాయం రూ.5లక్షల్లోపు ఉండాలని సూచించారు. అయితే, తెలంగాణ విద్యార్థులు విదేశాల్లో చదువుకునేందుకు ఆర్థిక సహాయం అందించేందుకు ప్రభుత్వం ఈ విద్యానిధి పథకాన్ని తీసుకొచ్చింది. దరఖాస్తు చేసుకున్న తర్వాత సెలెక్ట్ అయిన విద్యార్థులకు ఈ పథకం కింద విదేశాల్లో ఎంఎస్, పీహెచ్‌డీ చేసేందుకు ప్రభుత్వం రూ.20లక్షలు అందించనుంది.