TSRTC Merger Bill: టీఎస్ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై ఆమోదం
టీఎస్‌ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.

TSRTC Merger Bill: టీఎస్ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ రాష్ట్రప్రభుత్వం తీసుకొచ్చిన బిల్లును గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపారు. దీంతో ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులుగా మారారు. ఈ సందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులకు, కార్మికులకు గవర్నర్ శుభాకాంక్షలు తెలిపారు.
ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసమే..(TSRTC Merger Bill)
తెలంగాణ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుకు నెలరోజుల తర్వాత గవర్నర్ ఆమోదం తెలిపారు. తాను చేసిన 10 సిఫారసుల విషయంలో ప్రభుత్వ స్పందనపై సంతృప్తి చెందినట్లు గవర్నర్ పేర్కొన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం దృష్య్టా బిల్లుకు ఆమోదం తెలిపానని గవర్నర్ తమిళిసై అన్నారు. బిల్లు ఆపడం వెనక ఎలాంటి రాజకీయ కోణం లేదని ఆమె స్పష్టం చేశారు.గత నెలలో ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం బిల్లును గవర్నర్ వద్దకు పంపారు. ఈ బిల్లుకు సంబంధించి గవర్నర్ తమిళిసై.. ప్రభుత్వం తరఫున రవాణా శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీతో భేటీ అయ్యారు. అంతకుముందు అయితే మరోవైపు తమకు సంబంధించిన బిల్లును గవర్నర్ ఆమోదించడం లేదని ఆర్టీసీ ఉద్యోగులు, కార్మిక సంఘాలు ఛలో రాజ్‌భవన్‌కు పిలుపు ఇచ్చారు. శనివారం రెండు గంటల పాటు బస్సు సేవల్ని నిలిపివేసి నిరసన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి:
- China G20 Delegate: ఢిల్లీ హోటల్లో G20 చైనా ప్రతినిధి బృందం హై డ్రామా.. . బ్యాగుల తనిఖీకి ససేమిరా
- Siddharth Luthra: రాజమండ్రి సెంట్రల్ జైలులో చంద్రబాబును కలిసిన లాయర్ సిద్ధార్థ్ లూథ్రా