Home / Phone Tapping Case
TG Phone Tapping Case: సిట్ విచారణకు ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ప్రభాకర్‌రావు ఉన్నారు. సుమారు 14 నెలల తర్వాత అమెరికా నుంచి నిన్న హైదరాబాద్‌కు చేరుకున్న ప్రభాకర్‌రావు.. సుప్రీంకోర్టు ఆదేశాలతో విచారణకు హాజరయ్యారు. ప్రభాకర్‌రావు స్టేట్మెంట్ను సిట్ అధికారులు రికార్డు చేస్తున్నారు. పంజాగుట్ట పోలీసుస్టేషన్లో నమోదైన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆయన ఏ1గా ఉన్నారు. ప్రభాకర్‌రావు నుంచి కీలక సమాచారం రాబట్టాలని సిట్ అధికారులు […]
Telangana: ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం నెలకొంది. కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు నిన్న రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. కాగా శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో దిగగానే ఇమ్మిగ్రేషన్ అధికారులు ఆయనను ఆపారు. లుకౌట్ నోటీసులు అమలులో ఉండటంతో, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లోని ఇమ్మిగ్రేషన్ వద్ద పాస్ పోర్ట్ స్కానింగ్ సమయంలో అధికారులకు సమాచారం వెళ్లింది. దీంతో ఆయన ఇమ్మిగ్రేషన్ వివరాలను ప్రాసెస్ చేసిన అనంతరం.. ఇంటికి […]
Supreme Court: ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయనను అరెస్ట్ చేయొద్దని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. ప్రభాకర్ రావుకు పాస్ పోర్టు ఇవ్వాలని సూచించింది. పాస్ పోర్టు వచ్చిన 3 రోజుల్లో ప్రభాకర్ రావు భారత్ కు వచ్చి విచారణకు సహకరించాలని ఆదేశించింది. కాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు […]
Big Twist in Phone Tapping Case Accused Sravan Rao Attended To SIT: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫోన్ ట్యాపింగ్ కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరవ నిందితుడు శ్రవణ్ రావు సిట్ విచారణకు హాజరయ్యారు. ఈ విచారణలో భాగంగా ఆయన దుబాయ్ నుంచి తెల్లవారుజామున హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్నారు. అక్కడినుంచి విచారణ నిమిత్తం జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. […]