Home / ఆంధ్రప్రదేశ్
EX Minister Avanthi Srinivas Resign to YSRCP: వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీకి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆయన పార్టీని వీడడంతో పాటు ఆ పార్టీ సభ్యత్వం, భీమిలి నియోజకవర్గ ఇన్ ఛార్జ్ బాధ్యతలకు సైతం రాజీనామా చేశారు. ఆయన పార్టీని వీడుతున్నట్లు ప్రకటించడంతో పాటు రాజీనామా లేఖను వైసీపీ అధిష్టానానికి పంపించారు. అంతకుముందు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ప్రభుత్వ […]
Flight service from Rajamahendravaram Airport to Delhi: ఏపీ ప్రజలకు ఎన్డీఏ సర్కార్ శుభవార్త చెప్పింది. ఢిల్లీ వెళ్లేందుకు ప్రయాణాన్ని మరింత సులభతరంగా చేసింది. రాజమహేంద్రవరం ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీకి విమాన సర్వీస్‌ను ప్రారంభించింది. ఈ మేరకు ఇక్కడి నుంచి ఢిల్లీకి నేరుగా ప్రయాణించవచ్చు. కాగా, అంతకుముందు రాజమహేంద్రవరం నుంచి ఢిల్లీ వెళ్లాలంటే చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇదిలా ఉండగా, తొలుత రాజమహేంద్రవరం మధురపూడి ఎయిర్ పోర్టుకు మొదటి ఇండిగో డైరెక్ట్‌గా విమానం […]
Minister Nara Lokesh on 153 Govt Services on a Single Platform: ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇక నుంచి వాట్సాప్ ద్వారా 153 సేవలు అందనున్నాయి. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ సమాచారమంతా ఒకేచోట ఉండేలా వెబ్‌సైట్‌ను తీర్చిదిద్దుతున్నారు. వాట్సాప్ గవర్నన్స్‌పై కాన్ఫరెన్స్‌లో కీలక చర్చ జరుగుతోందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. వాట్సాప్ ద్వారా 153 సేవలు ఇచ్చేందుకు కార్యాచరణ రూపొందించినట్లు తెలిపారు. 10 […]
AP high court power deals with adani suchi deal: అదానీతో విద్యుత్ ఒప్పందంపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. అయితే గత కొంతకాలంగా ఈ ఒప్పందంపై మొదటి నుంచి వ్యతిరేకతలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఒప్పందాన్ని వ్యతిరేకిస్తూ.. గతంలోనే టీడీపీ నేత పయ్యావుల కేశవ్, సీపీఐ నేత రామకృష్ణ పిటిషన్లు వేసిన సంగతి తెలిసిందే. తాజాగా, ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. పిటిషనర్లు తరఫున సుప్రీంకోర్టు న్యాయవాది ఆది నారాయణరావులు వాదనలు […]
CM Chandrababu Holds Conference With District Collectors: రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్-2047, నేతన పాలసీలు, భవిష్యత్ లక్ష్యాలపై కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్ధేశం చేశారు. 6 నెలల పాలనలో చేపట్టిన సంక్షేమం, అభివృద్ధి అంశాలపై సచివాలయంలో రెండవ జిల్లా కలెక్టర్ల సమావేశంలో భాగంగా సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందన్నారు. ప్రతి సంక్షోభంతో అవకాశాలు ఉంటాయన్నారు. ఇలాంటి సంక్షోభంలో అవకాశాలు సృష్టించుకోవడమే నాయకత్వమని వెల్లడించారు. అనంతరం నాలుగున్నరేళ్లు […]
Man Arrested For Threatening Call For Pawan Kalyan: ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్‌ను చంపేస్తామంటూ ఆయన పేషీకి ఫోన్ చేసిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. సోమవారం జనసేనాని కార్యాలయానికి ఓ ఆగంతకుడు ఫోన్ కాల్స్ చేయడంతో పాటు సందేశాలు పంపించడం కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఈ కేసులో కీలక నిందితుడిని అరెస్ట్ చేశారు. పలు కోణాల్లో అతడిని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడి అరెస్ట్.. కాగా, పవన్‌కల్యాణ్ పేషీకి 9505505556 […]
Undavalli Arun Kumar Open Letter to deputy cm pawan kalyan: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు.. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర విభజన కారణంగా ఏపీకి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే బాధ్యతను పవన్ తీసుకోవాలని ఆ లేఖలో కోరారు. బీజేపీతో కలిసి అధికారంలో ఉండటంతో కేంద్రం నుంచి ఏపీకి రావాల్సిన విభజన హామీలను రాబట్టాలని సూచించారు. సుప్రీంకోర్టులో చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న రాష్ట్ర […]
R Krishnaiah to File Nomination for Rajya Sabha Elections: బీజేపీ నుంచి రాజ్యసభకు ఆర్.కృష్ణయ్య నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. తాను ఏనాడూ పార్టీలు మారలేదని, పార్టీలే తన వద్దకు వస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం తన సేవలను గుర్తించి బీజేపీ అధిష్టానం తనకు ఈ అవకాశం ఇచ్చిందని వెల్లడించారు. బీసీలకు న్యాయం జరగాలంటే.. కేవలం బీజేపీతోనే సాధ్యమని, అందుకే బీసీల ప్రయోజనం కోసం బీజేపీ చేరినట్లు స్పష్టం […]
AP High Court grants temporary relief to Ram Gopal Varma: డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మకు ఏపీ హైకోర్టులో భారీ ఊరట లభించింది. మూడు కేసుల్లో ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. సోషల్ మీడియా పోస్టింగ్ కేసులో ముందస్తు బెయిల్ మంజూరైంది. కాగా, ఎన్నికల సమయంలో చంద్రబాబు, నారా లోకేశ్, పవన్ కల్యాణ్‌పై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టుల కేసులో న్యాయస్థానం ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. అయితే, దర్యాప్తునకు సహకరించాలని రామ్ గోపాల్ వర్మకు […]
Heavy Rain Alert To AP For The Next Three days: ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్. రాష్ట్ర వ్యాప్తంగా రేపటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆగ్రేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. ఈ అల్పపీడనం ప్రభావంతో బుధవారం నుంచి శుక్రవారం వరకు కోస్తా, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ఏపీ ఎస్డీఎంఏ తెలిపింది. ప్రధానంగా కోస్తాంధ్ర జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలోని […]