Home / ఆంధ్రప్రదేశ్
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అరెస్టును నిరసిస్తూ తెలుగుదేశం పార్టీ మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. దేశం చేస్తోంది రావణాసుర దహనం.., మనం చేద్దాం జగనాసుర దహనం చేద్దామని నారా లోకేష్ పిలుపునిచ్చారు. అరాచక, విధ్వంసక పాలన సాగిస్తున్న సైకో జగనాసురుడి పీడ పోవాలని తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే, దివంగత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఓ ఇంటి వాడయ్యారు. ఆదివారం రాత్రి నరసాపురానికి చెందిన జక్కం పుష్పవల్లిని వివాహం చేసుకున్నారు.విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో జరిగిన ఈ వివాహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.
రాజమండ్రిలో రేపు జనసేన టీడీపీసమన్వయ కమిటీ సమావేశం జరుగనుంది. తొలి సమావేశ వేదిక మంజీరా హోటల్లో ఏర్పాట్లను ఉమ్మడి తూ.గో. జనసేన అధ్యక్షులు కందుల దుర్గేష్, టీడీపి నేత ఆదిరెడ్డి వాసు , జనసేన రాజమండ్రి ఇంఛార్జి అత్తి సత్యనారాయణ పరిశీలించారు. ఈరోజు సాయంత్రానికి రాజమండ్రి టీడీపీ క్యాంపు కార్యాలయానికి నారా లోకేష్ చేరుకోనున్నారు.
వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మించిన నాయకుడు భారత దేశంలో లేరని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గుంటూరులో విలేఖరులతో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. కేంద్రంలో తాము చక్రాలు తిప్పలేదని, రాష్ట్రపతిని నియమించలేదని అన్నారు.
తాను జైలులో లేనని., ప్రజల హృదయాల్లో ఉన్నానని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జైలు నుంచి ప్రజలకు లేఖ రాశారు. విధ్వంస పాలనను అంతం చేయాలనే సంకల్పంలో ఉన్నానని తెలిపారు. నలభై ఏళ్ల రాజకీయ జీవితం గురించి జైలు గోడల మధ్య ఆలోచించానని అన్నారు.
: కాకినాడ జిల్లా తాళ్ళరేవు లంక వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగిన ఏడుగురు యువకుల్లో నలుగురు యువకులు గల్లంతయ్యారు. మిగిలిన ముగ్గురు యువకులు క్షేమంగా ఒడ్డుకి చేరుకున్నారు. పశ్చిమగోదావరి జిల్లా తణుకు గ్రామం నుండి యానాం ప్రాంతానికి ఈ ఏడుగురు యువకులు విహార యాత్రకి వచ్చారు.
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మీడియా ప్రతినిధులతో, ప్రతిపక్షాల తో ఎలా వ్యవహరించాలి, బహిరంగ సభలలో ఎలా మాట్లాడాలి అన్నఅంశాలపై ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు.
ప్రజల కోసం టీడీపీ నేతలు నిత్యం పోరాడుతున్నారని నారా లోకేష్ అన్నారు. శనివారం తెలుగుదేశం పార్టీ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ భావోద్వేగానికి గురై కంట తడిపెట్టారు. ఐదేళ్లుగా టీడీపీ నేతలపై దొంగ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ప్రజెక్టులను సందర్శించడమే చంద్రబాబు చేసిన నేరమా అని ప్రశ్నించారు.
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మరోసారి మండిపడ్డారు. అంగళ్లులో పోలీసులపై దాడులు చేయించారని ఫైర్ అయ్యారు. పుంగనూరులో 40 మంది పోలీసులకు గాయాలయ్యేలా చేశారని.. ఓ కానిస్టేబుల్‌కి కన్ను కూడా పోయిందని నిప్పులు చెరిగారు.
ఆంధ్రప్రదేశ్ లో వచ్చే నెల 15 నుంచి రాష్ట్ర ప్రభుత్వం కులగణన చేబట్టబోతుందనే విషయంపై కాపు సంక్షేమ సేన వ్యవస్థాపక అధ్యక్షులు హరిరామజోగయ్య సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి వేణుగోపాల కృష్ణ ఈ ప్రకటన చేయడం పట్ల కాపు సంక్షేమ సేన స్వాగతించిందని జోగయ్య తెలిపారు.