Last Updated:

Vangaveeti Radhakrishna: ఘనంగా వంగవీటి రాధాకృష్ణ వివాహం.. హాజరయిన పవన్ కళ్యాణ్

మాజీ ఎమ్మెల్యే, దివంగత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఓ ఇంటి వాడయ్యారు. ఆదివారం రాత్రి నరసాపురానికి చెందిన జక్కం పుష్పవల్లిని వివాహం చేసుకున్నారు.విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో జరిగిన ఈ వివాహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.

Vangaveeti Radhakrishna: ఘనంగా వంగవీటి రాధాకృష్ణ వివాహం.. హాజరయిన  పవన్ కళ్యాణ్

Vangaveeti Radhakrishna:మాజీ ఎమ్మెల్యే, దివంగత వంగవీటి రంగా కుమారుడు వంగవీటి రాధాకృష్ణ ఓ ఇంటి వాడయ్యారు. ఆదివారం రాత్రి నరసాపురానికి చెందిన జక్కం పుష్పవల్లిని వివాహం చేసుకున్నారు.విజయవాడ పోరంకిలోని మురళీ రిసార్ట్స్‌లో జరిగిన ఈ వివాహానికి పలువురు రాజకీయ ప్రముఖులు, అభిమానులు విచ్చేసి వధూవరులను ఆశీర్వదించారు.

కొత్త జంటను ఆశీర్వదించిన పవన్ ..(Vangaveeti Radhakrishna)

ఈ వివాహానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తో కలిసి వివాహానికి హాజరయిన పవన్ కొత్త జంటను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ వివావాహానికి వైఎస్సార్‌సీపీ నేతలు కొడాలి నాని, వల్లబనేని వంశీ కూడా హాజరయ్యారు. గత నెలలో నర్సాపురం మాజీ మున్సిపల్ చైర్మన్ జక్కం అమ్మానీ బాబ్జి దంపతుల ద్వితీయ కుమార్తె పుష్పవల్లి తో రాధా నిశ్చితార్థం జరగ్గా ఆదివారం రాత్రి వివాహం జరిగింది.

వంగవీటి రాధాకృష్ణ 2004లో విజయవాడ తూర్పు నియోజక వర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్దిగా పోటీ చేసి గెలుపొందారు. 2009లో ప్రజారాజ్యం అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైసీపీ అభ్యర్దిగా పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల ముందు వైసీపీ నుంచి బయటకు వచ్చి టీడీపీలో చేరారు. ప్రస్తుతం ఆయన టీడీపీలో ఉన్నప్పటికీ పాలిటిక్స్ లో యాక్టివ్ గా లేరు. కొన్ని నెలల క్రితం నారా లోకేష్ యువ గళానికి మద్దతు పలికారు. రాధాకృష్ణ 2024 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తిగా ఉన్నారనే టాక్ బలంగా వినిపిస్తోంది. మరోవైపు ఆయన జనసేన పార్టీలో చేరుతారన్న ఊహాగానాలు కూడా ఉన్నాయి.