CM Jagan: అంగళ్లులో ప్రతిపక్ష పార్టీ పోలీసులపై దాడి చేయించింది… సీఎం జగన్
ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మరోసారి మండిపడ్డారు. అంగళ్లులో పోలీసులపై దాడులు చేయించారని ఫైర్ అయ్యారు. పుంగనూరులో 40 మంది పోలీసులకు గాయాలయ్యేలా చేశారని.. ఓ కానిస్టేబుల్‌కి కన్ను కూడా పోయిందని నిప్పులు చెరిగారు.
CM Jagan: ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ఏపీ సీఎం జగన్ మరోసారి మండిపడ్డారు. అంగళ్లులో పోలీసులపై దాడులు చేయించారని ఫైర్ అయ్యారు. పుంగనూరులో 40 మంది పోలీసులకు గాయాలయ్యేలా చేశారని.. ఓ కానిస్టేబుల్‌కి కన్ను కూడా పోయిందని నిప్పులు చెరిగారు.
ఖాకీ డ్రెస్ త్యాగనిరతికి నిదర్శనం..(CM Jagan)
శనివారం విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జరిగిన పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవంలో సీఎం జగన్ పాల్గొన్నారు. విధి నిర్వహణలో అమరులైన పోలీసలుకు నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ అవినీతి చేసి.. కోర్టుల్లో తమకు అనుకూల తీర్పులు రాకపోయేసరికి.. న్యాయమూర్తులపైనా ట్రోలింగ్ చేస్తారన్నారు. తమను ఎవరూ ఏమీ చెయ్యలేరన్న అహంకారంతో అన్నీ చేస్తారని.. ఇవన్నీ సమాజ వ్యతిరేక చర్యలు అని మండిపడ్డారు. తమ స్వార్థం కోసం.. ప్రజా జీవితంతో ఆడుకుంటున్నారు ధ్వజమెత్తారు. ఈ సంవత్సరం అమరులైన 168 మంది అమరవీర పోలీసులకు శ్రద్దాంజలి ఘటించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సమాజం కోసం తమ ప్రాణాలను పోలీసులు పణంగా పెడుతున్నారన్న సీఎం ఖాకీ డ్రెస్ త్యాగనిరతికి నిదర్శనం అన్నారు. డ్రెస్ పై ఉండే మూడు చిహ్నాలు దేశ సార్వభౌమత్వానికి గుర్తు అన్నారు. పోలీస్ అంటే బాధ్యత అన్న సీఎం.. ఈ ఉద్యోగం ఓ సవాల్ అని అన్నారు.