Last Updated:

Ambati Rambabu; వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట .. మంత్రి అంబటి రాంబాబు

వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మించిన నాయకుడు భారత దేశంలో లేరని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గుంటూరులో విలేఖరులతో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. కేంద్రంలో తాము చక్రాలు తిప్పలేదని, రాష్ట్రపతిని నియమించలేదని అన్నారు.

Ambati Rambabu; వ్యవస్థలను మేనేజ్ చేయడంలో చంద్రబాబు దిట్ట .. మంత్రి అంబటి రాంబాబు

Ambati Rambabu; వ్యవస్థలను మేనేజ్ చేయడంలో టీడీపీ అధినేత చంద్రబాబుకు మించిన నాయకుడు భారత దేశంలో లేరని మంత్రి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. గుంటూరులో విలేఖరులతో మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. కేంద్రంలో తాము చక్రాలు తిప్పలేదని, రాష్ట్రపతిని నియమించలేదని అన్నారు.

లోకేష్ ను నమ్ముకుంటే అంతే..(Ambati Rambabu)

పవన్ కు రాజకీయాలు తెలియవని, చంద్రబాబు రాజకీయ పల్లకి మోయడానికి పవన్ కళ్యాణ్ ఉన్నాడని అంబటి పేర్కొన్నారు. పవన్ మాటలు వింటే గోదారిలో మునిగినట్లేనని, మీ ఇంట్లో జగన్ వల్ల మేలు జరిగితే వైసీపీకి ఓటు వేయాలని అంబటి రాంబాబు అన్నారు. లోకేష్‌కు పార్టీని నడిపే సత్తా, సామర్థ్యం లేవు. కేవలం ఏడవడానికే పనికివస్తాడు. టీడీపీకి పట్టిన శని. ఆయన్ను నమ్ముకుంటే మీ దురదృష్టం. లోకేష్ ను నమ్మకుంటే బంగాళాఖాతంలోకి వెడతారు. మీకు కూడా గత్యంతరం లేదు. లోకేష్ జగన్ ను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నాడు. రాజకీయాన్ని వ్యాపారం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. ఎన్టీఆర్, ఇందిరాగాంధీ, చెన్నారెడ్డి, బ్రహ్మానంద రెడ్డి ఉన్నపుడు ఎన్నికల ఖర్చు చాలా తక్కువగా ఉంది. చంద్రబాబు వచ్చాక ఎన్నికల్లో కోట్టు కుమ్మరించడం, అధికారంలోకి వచ్చాక సంపాదించడం నైజంగా చేసుకున్నారు. చంద్రబాబు డైరక్టుగా దొరికారు. పలు చోట్ల సంతకాలు పెట్టారు. అందుకే కోర్టులో చుక్కెదురు అవుతోంది. చేసిన తప్పుకు ఎవరైనా శిక్ష అనుభవించవలసిందేనని అంబటి రాంబాబు అన్నారు.

చంద్రబాబుకు అంబటి బహిరంగ లేఖ..

మరోవైపు చంద్రబాబుకు మంత్రి అంబటి బహిరంగ లేఖ రాశారు. 45 రోజుల జైలు జీవితం తర్వాత కూడా, నాలుగైదు నిజాలు చెబుతారేమో అన్న ఆశను నిరాశగా మారుస్తూ ఉత్తరం రాశారని ఎద్దేవా చేశారు. జైలు నుంచి ఈ ఉత్తరాన్ని ఎలా బయటకు పంపారన్న టెక్నికల్ డీటెయిల్స్‌లోకి తాను వెళ్లడం లేదని అన్నారు. మీ పేరిట టీడీపీయే ఈ ఉత్తరం ఇచ్చిందని అన్నారు. జైలులో లేనని లేఖలో రాశారు కనుక క్వాష్‌ పిటిషన్లు, బెయిల్ పిటిషన్లు ఉపసంహరించుకోండని సూచించారు. మీ ఉద్దేశంలో ప్రజలంటే ఎవరని ప్రశ్నించారు. పలు ప్రశ్నలను సంధించారు.