Last Updated:

JanaSena chief Pawan Kalyan: ఎవరితో కలిసినా రాష్ట్రప్రజలకు మేలు చేయడానికే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మీడియా ప్రతినిధులతో, ప్రతిపక్షాల తో ఎలా వ్యవహరించాలి, బహిరంగ సభలలో ఎలా మాట్లాడాలి అన్నఅంశాలపై ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు.

JanaSena chief Pawan Kalyan: ఎవరితో కలిసినా రాష్ట్రప్రజలకు మేలు చేయడానికే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్

JanaSena chief Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ శనివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. మీడియా ప్రతినిధులతో, ప్రతిపక్షాల తో ఎలా వ్యవహరించాలి, బహిరంగ సభలలో ఎలా మాట్లాడాలి అన్నఅంశాలపై ఈ సమావేశంలో నేతలకు దిశానిర్దేశం చేశారు.

వ్యక్తిగత దూషణలు వద్దు..(JanaSena chief Pawan Kalyan)

రానున్న రోజులలో ప్రత్యేకించి టిడిపి జనసేన పొత్తుపై వైసిపి చేస్తున్న దాడులను ఏ విధంగా ఎదుర్కోవాలనే దానిపై మార్గనిర్దేశం చేశారు. అధికార ప్రతినిధులకు ఎదురవుతున్న సమస్యలను ఏ విధంగా పరిష్కరించుకోవాలో సూచించారు. ఈ సమావేశంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ పార్టీ అభిప్రాయాలను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని చెప్పారు. ప్రజా సమస్యలపై నేతలు బలంగా మాట్లాడాలన్నారు.
కులాలు, మతాలు గురించి మాట్లాడాల్సి వస్తే..రాజ్యాంగానికి లోబడి మాట్లాడాలని అన్నారు. చర్చల్లో పార్టీ విధానాలకు కట్టుబడి మాట్లాడాలని వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు తావులేదని చెప్పారు.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ అధికార ప్రతినిధులది గురుతర బాధ్యతని పవన్ పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాల్లో లోపాలు, వైఫల్యాలపై సమర్థంగా మాట్లాడాలన్నారు.

తాను ఏ పార్టీకి, నాయకుడికి వ్యతిరేకం కాదన్న పవన్ ఎవరితో కలిసినా అది రాష్ట్ర ప్రజలకు మేలు చేయడానికే అని చెప్పారు. పార్టీ ప్రతినిధిగా ఉన్నవారు సోషల్ మీడియాలో వ్యక్తిగత పోస్టులు పెట్టవదన్నారు. తన సినిమాలు, కుటంబ సభ్యులపై వచ్చే విమర్శలపైన కూడా స్పందించవద్దని చెప్పారు. రాజకీయాల్లో శాశ్వతమిత్రులు, శాశ్వత శత్రువులు వుండరని తెలిపారు.