Last Updated:

Electric Shock: కైకలూరులో విషాదం.. విద్యుత్ షాక్ కు గురై ఒకరు మృతి

కైకలూరులో విషాదం చోటుచేసుకొనింది. విద్యుత్ షాక్ కు గురై ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలైనాయి. బాధితులు ఇరువురు సొంత అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబం తల్లడిల్లింది.

Electric Shock: కైకలూరులో విషాదం.. విద్యుత్ షాక్ కు గురై ఒకరు మృతి

Eluru District: కైకలూరులో విషాదం చోటుచేసుకొనింది. విద్యుత్ షాక్ కు గురై ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్రగాయాలైనాయి. బాధితులు ఇరువురు సొంత అన్నదమ్ములు కావడంతో ఆ కుటుంబం తల్లడిల్లింది. పోలీసుల సమాచారం మేరకు కైకలూరు మండలంలోని నరసాయపాళెంకు చెందిన ఓ రైతు చేపల చెరువులో పట్టుబడికి కొవ్వాలంక కూలీలు వెళ్లారు. చెరువు వద్దకు చేరుకొన్న కూలీలు వ్యాన్ నుండి ఇనుపరాడ్డులను తీస్తున్నసమయంలో పైనున్న విద్యుత్ తీగలు తగిలాయి. కూలీల్లోని నాగరాజు, సైదు కుమార్లకు తీవ్రగాయాలైనాయి. ఇరువురిని హుటాహుటిన స్థానిక వైద్యశాలకు తరలించారు. మార్గమద్యంలో నాగరాజు మృతి చెందాడు. మృతుడికి భార్య, ఐదేళ్ల కుమార్తె, మూడేళ్ల కుమారుడు ఉన్నారు. కేసు నమోదు చేసుకొన్న పోలీసులు విచారణ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Chandrababu Naidu: వైసిపి ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది.. చంద్రబాబు నాయుడు