Last Updated:

Nagababu : 20 ఏళ్ల వరకు జగన్ కలలు కంటూనే ఉండాలి.. నాగబాబు హాట్ కాంమెట్స్

Nagababu : 20 ఏళ్ల వరకు జగన్ కలలు కంటూనే ఉండాలి.. నాగబాబు హాట్ కాంమెట్స్

Nagababu : పిఠాపురం ప్రజలు, జన సైనికులకు రుణపడి ఉన్నామని ఎమ్మెల్సీ నాగబాబు అన్నారు. జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పిఠాపురం సమీపంలోని చిత్రాడలో ఏర్పాటు చేసిన జయకేతనం సభకు పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు. ఈ సందర్భంగా 12 ఏళ్ల జనసేన పార్టీ ప్రస్థానంపై ప్రత్యేకంగా రూపొందించిన డాక్యుమెంటరీని వేదికపై ప్రదర్శించారు. పార్టీకి చెందిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, నాయకులు, కార్యకర్తలు, పవన్‌ అభిమానులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు.

 

ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడారు. నాయకులు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని చురలు అంటించారు. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం జరుగుతుందో చూశామని చెప్పారు. నోటి దురుసు ఉన్న నేతకు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదని కామెంట్ చేశారు. రాజకీయాల్లో జాగ్రత్తగా మాట్లాడాలని పవన్‌ చెప్పినట్లు పేర్కొన్నారు. వైఎస్ జగన్‌ లాంటి హాస్యనటులు ఎన్నో కలలు కన్నారని, కళ్లు మూసి తెరిసే లోపే 9 నెలలు గడిచిపోయాయని, ఇంకో సారి కళ్లు మూసి తెరిస్తే ఐదేళ్లు గడచిపోతాయన్నారు. ఆ తర్వాత అధికారం తమదే అని జగన్‌ అంటున్నారని, ఇంతకన్నా అద్భుతంగా ఎవరూ హాస్యం పండించలేరన్నారు. మరో 20 ఏళ్ల వరకు జగన్‌ కలలు కంటూనే ఉంటాడని తెలిపారు.

 

ప్రజల బాగోగులు చూసే వ్యక్తి పవన్ కల్యాణ్‌ అన్నారు. అలాంటి ఒక గొప్ప వ్యక్తిగా కావాలని, లేకపోతే ఆయనకు అనుచరుడిగా ఉండాలన్నారు. వచ్చే రెండు, మూడు తరాల గురించి ఆలోచించే వ్యక్తి పవన్‌ అని పేర్కొన్నారు. దేవుడు అడిగితేనే వరాలిస్తాడు.. కానీ, పవన్ అడగకుండానే వరాలిస్తారని కొనియాడారు. తనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చిన పవన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జనసైనికుడిని అని చెప్పుకొనేందుకు గర్వపడుతున్నానని, పిఠాపురంలో పవన్‌ విజయానికి తానే కారణమని ఎవరైనా అనుకుంటే అది వారి ఖర్మ అన్నారు. పవన్‌ గెలుపునకు ఆయన, పిఠాపురం పౌరులే కారణంమని నాగబాబు అన్నారు.

ఇవి కూడా చదవండి: