Last Updated:

Krishnamraju Smriti Vanam: ఏపీలో రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మృతివనం

ప్రముఖ నటుడు, భాజాపా మాజీ కేంద్ర మంత్రి దివంగత కృష్ణంరాజు గుర్తుగా మొగల్తూరు తీరప్రాంతంలో ఆయన పేరుతో రెండు ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు రోజా, వేణు, నాగేశ్వర రావులు తెలిపారు

Krishnamraju Smriti Vanam: ఏపీలో రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మృతివనం

Mogulthur: ప్రముఖ నటుడు, భాజాపా మాజీ కేంద్ర మంత్రి దివంగత కృష్ణంరాజు గుర్తుగా మొగల్తూరు తీరప్రాంతంలో ఆయన పేరుతో రెండు ఎకరాల్లో స్మృతి వనం ఏర్పాటు చేయనున్నట్లు మంత్రులు రోజా, వేణు, నాగేశ్వర రావులు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా మొగుల్తూరులో అశేష జనవాహిని నడుమ చేపట్టిన కృష్ణంరాజు సంస్మరణ సభలో వారు పాల్గొన్నారు. ఆయన చిత్రపటానికి ఘన నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ తెలుగు ప్రజల గుండెల్లో కృష్ణంరాజు చిర్మస్మరణీయుడన్నారు. భౌతికంగా దూరమైన్నప్పటికీ ఆయన ప్రజలకు చేసిన సేవలను మరిచిపోలేరని పేర్కొన్నారు. రెబల్ స్టార్ గా పేరొందిన నటుడు కృష్ణంరాజు, రాజకీయాల్లో పీపుల్స్ స్టార్ గా ఎదిగారని వారు వ్యాఖానించారు. స్వగ్రామంలో చేపట్టిన నటుడి సంస్మరణ సభలో ఆల్ ఇండియా ఫేం, బాహుబలి నటుడు, కృష్ణంరాజు కుటుంబసభ్యుడు ప్రభాస్ కూడా పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: ఇంద్రకీలాద్రిలో భక్తుల ఇక్కట్లు

ఇవి కూడా చదవండి: