CM Chandrababu: సీఎం కీలక సమావేశం.. సంపద సృష్టించి పేదలకు పంచాలనేది లక్ష్యం
![CM Chandrababu: సీఎం కీలక సమావేశం.. సంపద సృష్టించి పేదలకు పంచాలనేది లక్ష్యం](https://s3.ap-south-1.amazonaws.com/media.prime9news.com/wp-content/uploads/2025/02/cm-chandrababu.jpg)
CM Chandrababu Meeting with Ministers: సమర్థ నాయకత్వం ఉంటే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యమవుతోందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అమరావతిలో మంగళవారం సీఎం అధ్యక్షతన జరుగుతున్న మంత్రులు, కార్యదర్శులతో సమావేశంలో ఆయన మాట్లాడారు. సంపద సృష్టించి పేదలకు పంచాలని చంద్రబాబు వివరించారు. గత 8 నెలలుగా ప్రతీ గంటా లెక్కిస్తున్నామని, పాలన ట్రాక్‌లో పడిందని చంద్రబాబు అన్నారు. 93 శాతం స్ట్రైక్ రేట్‌తో విజయం సాధించామని చెప్పారు.
వికసిత్ భారత్ కోసం ఏం చేయాలో కేంద్రం చెప్పిందని, 2047 స్వర్ణాంధ్రప్రదేశ్ కోసం ఏం చేయాలో మనం చెప్పామని చంద్రబాబు వివరించారు. ఫైల్స్ క్లియరెన్స్‌లో వేగం పెంచాలని, నేను ఇవన్నీ ఎవరినీ ఉద్దేశించి చెప్పడం లేదన్నారు. ఆరు నెలల కాలంలో 12.94 శాతం వృద్ధిరేటు నమూదైందని వెల్లడించారు. గత ఐదేళ్ల విధ్వంసం కారణంగా చాలా వెనుకబడి పోయామని, నెమ్మదిగా ఒక్కో సమస్యను అధిగమిస్తున్నామన్నారు. ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై వెంటనే నిర్ణయం తీసుకొని ముందుకెళ్తున్నామని చెప్పారు. సమస్యలను పరిస్కరిస్తేనే మంచి రిజల్ట్స్ వస్తాయని అన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రతీసారి ఓ సవాల్ ఉండేదని, కానీ ఇన్ని సవాళ్లు ఎదుర్కోవడం ఇదే మొదటిసారి అని చెప్పుకొచ్చారు. ఇప్పటికే ేడు శ్వేతపత్రాలు విడుదల చేశామని, గాడితప్పిన వ్యవస్థలను సరిదిద్దుతున్నామన్నారు. 15శాతం వృద్ధిరేటుతో ఆర్థిక వ్యవస్థ సుస్థిరం కావాలని సూచించారు.