Purandeshwari: దేశంలో అవినీతి రహిత పాలన.. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమికి పట్టం
AP BJP Chief Purandeswari: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమికే మరాఠిలు పట్టం కట్టారని ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి అన్నారు. ఎన్డీయే కూటమి అద్భుతమైన విజయం సాధించడంతో ఆమె హర్షం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి మాట్లాడారు. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీయే కూటమి సుపరిపాలన అందించిందన్నారు. అవినీతి రహిత పాలన చేసిందన్నారు. దేశాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిందన్నారు. ప్రధాని మోదీ ప్రపంచ దేశాల్లో పర్యటిస్తూ దేశ ఔన్యత్యాన్ని పెంచారని గుర్తుచేశారు. అభివృద్ధికి పెద్దపీట వేశారన్నారు. ఎన్నికల్లో మహారాష్ట్ర ప్రజలు పట్టం కట్టారన్నారు.
దేశాభివృద్ధిని మరిచి బీజేపీని ఓడించాలనే లక్ష్యంతో ఇండియా కూటమి పని చేసిందని ఆరోపించారు. ఇండియా కూటమి సిద్ధాంతాలను, వారి ఆలోచన విధానాన్ని మహారాష్ట్ర ప్రజలు తిరుస్కరించారన్నారు. ఎన్డీయే కూటమి దేశాభివృద్ధి కోసం పని చేస్తోందన్నారు. జార్ఖండ్ ఫలితాలపై సమీక్షించుకుంటామని తెలిపారు. జార్ఖండ్ అభివృద్ధికి బీజేపీ సహకరిస్తుందన్నారు. దేశాన్ని, సమాజాన్ని విభజించు అనే ధోరణితో పని చేస్తున్న కాంగ్రెస్ విధానాన్ని మహారాష్ట్ర ప్రజలు తిరస్కరించారని విమర్శించారు.