Last Updated:

Fiber Net Case : ఫైబర్‌నెట్‌ కేసులో అటాచ్‌ చేయాలని నిర్ణయించిన ఆస్తుల ఇవే..?

ఫైబర్‌నెట్‌ కుంభకోణం కేసులో చంద్ర­బాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో చంద్ర­బాబును ఏ–25గా, ఏ–1 గా వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఏ–13గా టెరా­సాఫ్ట్‌ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్‌ ఉన్నారు. కాగా ఇప్పుడు నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహి­తుల

Fiber Net Case : ఫైబర్‌నెట్‌ కేసులో అటాచ్‌ చేయాలని నిర్ణయించిన ఆస్తుల ఇవే..?

Fiber Net Case : ఫైబర్‌నెట్‌ కుంభకోణం కేసులో చంద్ర­బాబుకు ఎదురుదెబ్బ తగిలింది. ఈ కేసులో చంద్రబాబు సహా పలువురిపై సీఐడీ కేసు నమోదు చేసింది. ఇందులో చంద్ర­బాబును ఏ–25గా, ఏ–1 గా వేమూరి హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీ, ఏ–13గా టెరా­సాఫ్ట్‌ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్‌ ఉన్నారు. కాగా ఇప్పుడు నిందితులుగా ఉన్నచంద్రబాబు సన్నిహి­తుల ఆస్తుల అటాచ్‌మెంట్‌కు విజయవాడ ఏసీబీ న్యాయ­స్థానం అనుమతి ఇచ్చింది. సీఐడీ దాఖలు చేసిన అటాచ్‌మెంట్‌ పిటిషన్‌ను ఆమోదిస్తూ న్యాయ­స్థానం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది.

కుంభకోణంలో నిందితుల పాత్రపై స్పష్టమైన ఆధారాలు లభించడంతో వారి ఆస్తులను అటాచ్‌ చేయాలని సీఐడీ నిర్ణయించింది. ఏపీ, తెలంగా­ణలో టెరాసాఫ్ట్‌ కంపెనీ, తుమ్మల గోపీచంద్‌ తది­త­రుల పేరిట ఉన్న రూ.114 కోట్ల విలువైన ఏడు స్థిరా­స్తులను అటాచ్‌ చేయాలన్న సీఐడీ ప్రతిపా­ద­నను హోం శాఖ ఆమోదించింది. దాంతో ఆస్తుల అటా­చ్‌మెంట్‌కు అనుమతి కోరుతూ సీఐడీ న్యాయ­స్థాన­ంలో పిటిషన్‌ దాఖలు చేయగా.. న్యాయ­స్థానం అనుమతి ఇచ్చింది.

ఏపీ గవర్నింగ్‌ కౌన్సిల్‌లో సభ్యుడిగా ఉన్న వేమూరి హరికృష్ణను ఫైబర్‌నెట్‌ టెండర్ల మదింపు కమిటీలో సభ్యుడిగా నియమించారు. ఆయనకు చెందిన టెరాసాఫ్ట్‌ కంపెనీయే టెండర్లలో పాల్గొని, పనులు దక్కించుకుంది. ఇది పరస్పర ప్రయోజనాల నిరోధక చట్టానికి విరుద్ధం అని.. టెరా­సాఫ్ట్‌ కంపెనీ పనులు కూడా నాసిరకంగా చేసి, రూ.144.53 కోట్లను దారి మళ్లించినట్టు సీఐడీ దర్యాప్తులో వెల్లడైంది.

అటాచ్‌ చేయాలని నిర్ణయించిన ఆస్తుల వివరాలు (Fiber Net Case).. 

టెరాసాఫ్ట్‌ కంపెనీ ఎండీ తుమ్మల గోపీచంద్‌ పేరిట హైదరాబాద్‌ జూబ్లీహిల్స్‌లో ఉన్న ఫ్లాట్, శ్రీనగర్‌ కాలనీలో ఉన్న రెండు ఫ్లాట్లు, ఆయన పేరిటే యూసఫ్‌గూడలో ఉన్న మరో ఫ్లాట్‌.

తుమ్మల గోపీచంద్‌ భార్య పవన దేవి పేరి­ట తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మొయి­నాబాద్‌లో ఉన్న వ్యవసాయ భూమి.

ఈ కేసులో నిందితుడు కనుమూరి కోటే­శ్వ­ర­రావు పేరిట గుంటూరులో ఉన్న 797 చద­రపు అడుగుల ఇంటి స్థలం.

కోటేశ్వరరావు డైరెక్టర్‌గా ఉన్న నెప్‌టాప్స్‌ ఫైబర్‌ సొల్యూషన్స్‌కు చెందిన విశాఖ­పట్నం కిర్లంపూడి లేఅవుట్‌లోని ఓ ఫ్లాట్‌.