KTR: కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్.. క్వాష్ పిటిషన్ నిరాకరణ
Supreme Court Big Shock to KTR: మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. కేటీఆర్ దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై తక్షణ విచారణకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణకు ఈనెల 15కు వాయిదా వేసింది. ఈ మేరకు 15న విచారించనున్నట్లు సీజేఐ తెలిపింది.
ఇదిలా ఉండగా, కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను 15వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు తెలపగా.. అప్పటివరకు ఈ కేటీఆర్ క్వాష్ పిటిషన్‌ను విచారించాల్సిన అవసరం లేదని చెప్పింది. కాగా, అంతకుముందు హైకోర్టులో కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో పాటు మధ్యంతర ఉత్తర్వులను సైతం హైకోర్టు కొట్టివేసింది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ప్రస్తుతం ఏసీబీ ఆఫీస్‌లో కేటీఆర్ విచారణ కొనసాగుతోంది. రెండు గంటలుగా ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. కేటీఆర్‌పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. పలు డాక్యుమెంట్లు, స్టేట్ మెంట్ల ఆధారంగా ప్రశ్నలు అడుగుతున్నారు. నిధుల మళ్లింపు, దుర్వినియోగంపై ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు.
అయితే, కేటీఆర్‌పై ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జైలుకు వెళ్తూ కూడా అహంకారం ప్రదర్శిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రతిష్ఠ పెంచామని అబద్ధాలు చెబుతున్నారని విమర్శలు చేశారు. ఫార్ములా ఈ కార్ రేసులో అవినీతి జరిగిందని, అంతనర్జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు తీశారని ఆరోపించారు. అరపైసా అవినీతి జరగలేదంటున్న కేటీఆర్.. అనుమతి లేకుండా రూ.55కోట్లు ఎలా పంపించారన్నారు. తెలంగాణ సంపదను విదేశాలకు అప్పనంగా దోచి పెట్టారని, సీఎంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
మరోవైపు, కేటీఆర్‌పై కుట్రపూరిత కేసు పెట్టారని మాజీ మంత్రి మహమూద్ అలీ విమర్శించారు. కేసులను చట్టపరంగా ఎదుర్కొంటామని వెల్లడించారు.