Monkeypox: కేరళలో మంకీపాక్స్ రెండవకేసు
దేశంలో క్రమంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మొదటి కేసు కేరళలో వెలుగు చూడగా.. రెండో కేసు కూడా కేరళలోనే నమోదైంది. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ కేసు వెలుగు చూసినట్లు రాష్ర్ట వైద్యశాఖ ధ్రువీకరించింది. 31 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఈ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిపై దృష్టి
Kerala: దేశంలో క్రమంగా మంకీపాక్స్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా మొదటి కేసు కేరళలో వెలుగు చూడగా, రెండో కేసు కూడా కేరళలోనే నమోదైంది. కేరళలోని కన్నూర్ జిల్లాలో ఈ కేసు వెలుగు చూసినట్లు రాష్ర్ట వైద్యశాఖ ధ్రువీకరించింది. 31 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్నాడు. ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని, ఈ వ్యక్తితో సన్నిహితంగా మెలిగిన వారిపై దృష్టి సారించామని రాష్ర్ట ఆరోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ప్రస్తుతం మన దేశంలో ఇది రెండో మంకీపాక్స్ కేసుగా రికార్డయ్యింది.
ఈ నెల 13న దుబాయ్ నుంచి కర్నాటకలోని మంగళూరు విమానాశ్రయంలో దిగిన వెంటనే అనారోగ్యం కారణంగా ఆ వ్యక్తి ఆస్పత్రిలో చేరారు. అతడి నమూనాలను ఎన్‌ఐవీ పూనేకు పంపగా పాజిటివ్‌గా తేలిందని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా ఇటీవలే యూఏఈ నుంచి కేరళలోని కొల్లాంకు వచ్చిన వ్యక్తిలో ఈ వైరస్‌ను గుర్తించారు. ఈ వ్యక్తి యూఏఈలో మంకీపాక్స్ సోకిన వ్యక్తితో సన్నిహితంగా మెలగడంతో మంకీపాక్స్ బారినపడ్డారు. దీంతో దేశంలో మొట్టమొదటి కేసుగా ఇది రికార్డుకెక్కింది. మంకీపాక్స్ కేసు బయటపడగానే కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది. కేరళ వైద్య సిబ్బందికి సహకరించే నిమిత్తం గత వారం కేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతస్థాయి బృందాన్ని పంపింది.
మంకీపాక్స్ వ్యాధి లక్షణాల విషయానికి వస్తే ఇది ఒక వైరల్ వ్యాధి. ఇది కూడా స్మాల్‌పాక్స్ కుటుంబానికి చెందినదే. జంతువుల నుంచి మనుషులకు సోకుతుంది. సాధారణంగా మధ్య, పశ్చిమ ఆఫ్రికా దేశాల్లో ఈ వైరస్ అధికంగా వ్యాపిస్తుంటుంది. తుంపర్ల ద్వారా, లేదా వ్యాధి సోకిన వ్యక్తికి అతి దగ్గరం ఉండటం వల్ల ఇది ఇతరులకు వ్యాపించే అవకాశముందని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలోకి పూర్తిగా వ్యాప్తి చెందడానికి సాధారణంగా 6 నుంచి 13 రోజులు సమయం పడుతుంది. ఒక్కోసారి 5 నుంచి 21 రోజుల సమయం కూడా పడుతుందంటున్నారు. ఈ వైరస్‌ను 1958లో మొదటిసారిగా కోతుల్లో గుర్తించారు. అందుకే మంకీపాక్స్ అని పేరుపెట్టారు. ఆ తర్వాత 1970ల్లో తొలిసారి మనుషుల్లో ఇది వెలుగు చూసింది. సాధారణంగా ఎలుకలు, చుంచు, ఉడతల నుంచి కూడా ఈ వ్యాధి అధికంగా వ్యాపిస్తున్నట్లు పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
ఇక ఈ వ్యాధి లక్షణాల విషయానికి వస్తే జ్వరం, తలనొప్పి, వాపు, నడుంనొప్పి, కండరాల నొప్పి, అలసట వంటివి మంకీపాక్స్ లక్షణాలు. స్మాల్‌పాక్స్ మాదిరిగానే ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు, బొబ్బలు ఏర్పడతాయి. ఒక్కోసారి శరీరమంతా వచ్చే అవకాశం కూడా ఉంటుందట. ఈ లక్షణాలు 14 నుంచి 21 రోజుల్లో బయటపడతాయి. మైల్డ్ కేసుల్లో లక్షణాలు కనిపించకపోవచ్చు. ఈ వ్యాధి సోకిన వారిలో చాలా మంది వారాల్లోనే కోలుకుంటారు. అయితే 10 మందిలో ఒకరికి ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం కూడా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది.