Last Updated:

Salaar : ప్రభాస్ “సలార్” మూవీ అప్డేట్ వచ్చేసిందోచ్.. టీజర్ రిలీజ్ కి టైమ్ ఫిక్స్

పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్ . ఈ సినిమాలో శృతి హాసన్ ప్రభాస్ కు జంటగా నటిస్తోంది. అలానే మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ లు బట్టి ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా

Salaar : ప్రభాస్ “సలార్” మూవీ అప్డేట్ వచ్చేసిందోచ్.. టీజర్ రిలీజ్ కి టైమ్ ఫిక్స్

Salaar : పాన్-ఇండియన్ స్టార్ ప్రభాస్, కెజిఎఫ్ డైరక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో వస్తున్న చిత్రం సలార్ . ఈ సినిమాలో శృతి హాసన్ ప్రభాస్ కు జంటగా నటిస్తోంది. అలానే మలయాళ స్టార్ యాక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబు విలన్స్ గా కనిపించబోతున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్ లు బట్టి ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుంది అంటూ అర్ధమవుతుంది. అటు అభిమానులు, ఇటు పరిశ్రమలో ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ప్రకటించిన విషయం తెలిసిందే.

బాహుబలి తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్, ఆదిపురుష్ సినిమాలు ప్రభాస్ ఫ్యాన్స్ కి నిరాశ మిగల్చడంతో అభిమానులంతా ఈ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ప్రస్తుతం సలార్ షూటింగ్ చివరి దశలో ఉందని సమాచారం. ఇప్పటి దాకా ఈ చిత్రం నుంచి ఫస్ట్ లుక్స్ తప్ప మరొక అప్డేట్ రాలేదు. దీంతో అభిమానులు టీజర్ లేదా గ్లింప్స్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రభాస్ అభిమానులకు చిత్రయూనిట్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు.

సలార్ టీజర్ ని జులై 6 ఉదయం 5 గంటల 12 నిమిషాలకు విడుదల చేస్తామని ప్రకటించారు. అదే విధంగా ప్రభాస్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. దీంతో ప్రభాస్ అభిమానులు అంతా ఫుల్ జోష్ లో చెలరేగుతూ.. సోషల్ మీడియా లో పోస్టర్ ని వైరల్ చేస్తున్నారు. కేజీఎఫ్ తర్వాత నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా మరోసారి రికార్డులన్నింటిని తిరగరాయడం పక్కా అని అంతా బలంగా భావిస్తున్నారు.