Bhola Shankar : షూటింగ్ కి గుమ్మడికాయ కొట్టేసిన మెగాస్టార్ ‘భోళా శంకర్’ టీమ్..
మెగాస్టార్ చిరంజీవి అటు పర్సనల్ గా.. ఇటు ప్రొఫెషనల్ గా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఒక వైపు వకాదని తర్వాత మరొక సినిమా కంప్లీట్ చేస్తూ దూసుకుపోతుంటే.. మరో వైపు రీసెంట్ గానే మరోసారి తాతగా మారారు. ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’తో.. చిరు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే.

Bhola Shankar : మెగాస్టార్ చిరంజీవి అటు పర్సనల్ గా.. ఇటు ప్రొఫెషనల్ గా ఫుల్ జోష్ లో ఉన్నారు. ఒక వైపు వకాదని తర్వాత మరొక సినిమా కంప్లీట్ చేస్తూ దూసుకుపోతుంటే.. మరో వైపు రీసెంట్ గానే మరోసారి తాతగా మారారు. ఇటీవలే ‘వాల్తేరు వీరయ్య’తో.. చిరు బ్లాక్ బాస్టర్ హిట్ అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.
ఈ చిత్రంలో చిరు సరసన మిల్క్ బ్యూటీ తమన్నా భాటియా హీరోయిన్ గా నటిస్తోంది. మహానటి ఫేమ్ కీర్తి సురేష్ చెల్లెలి పాత్రలో అలరించబోతోంది. తమిళ్ మూవీ వేదాలం కి రీమేక్ గా ఈ మవవీ రాబోతుంది. ఏకే ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్ పై నిర్మాత అనిల్ సుంకర నిర్మించారు. చిత్రంలో బుల్లితెర యాక్ట్రెస్ శ్రీముఖి, రష్మీగౌతమ్ లు కూడా కనిపించబోతున్నారు. సాగర్ మహతీ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 11న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. చిరును ‘భోళా శంకర్’ (Bhola Shankar) లో నయా లుక్ లో చూపిస్తున్నారు. వింటేజ్ మెగాస్టార్ ను చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ , టీజర్ చూస్తుంటే అర్థమవుతోంది.
అయితే కొన్ని నెలలుగా ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న విషయం తెలిసిందే. ఎట్టకేళలకు తాజాగా పూర్తైందని దర్శకుడు మెహర్ రమేశ్ తెలిపారు. ఈ సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేశారు. మెగాస్టార్ తో చాలా ప్రేమగా ఉన్న ఫొటోలను అభిమానులతో షేర్ చేసుకున్నారు. అలాగే సినిమా కోసం రాత్రి పగలు కష్టపడ్డ యూనిట్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలని తెలిపారు.
@BholaaShankar
Shoot has completed
Whole hearted thanks to the cast & crew who are working non-stop day & night
Post-production works going on with full swing. Promotions & song releases ahead. #August11thworldwide release #BholaaShankar @KChiruTweets
… pic.twitter.com/9ldUDfgsMv
— Meher Ramesh
(@MeherRamesh) July 3, 2023