Home / తాజా వార్తలు
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే పై బీహార్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఏటీఎం కియోస్క్‌లోని క్యాష్ చెస్ట్‌ను తెరిచేందుకు కష్టపడ్డ దొంగల ముఠా చేసేదేమీ లేక మొత్తం ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున బిచ్కుంద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం కియోస్క్‌లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు మెషిన్లో నగదు ఉందని గుర్తించారు
:ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం యొక్క మొదటి విడత పొందిన తర్వాత దాదాపు 11 మంది వివాహిత మహిళలు తమ ప్రేమికులతో పారిపోయారు.
ముంబై లోని వర్లీ హిట్ అండ్ రన్ కేసులో ప్రధాన నిందితుడు మిహిర్ షాను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. అతను తన బీఎండబ్ల్యూ తో స్కూటర్‌ను ఢీకొట్టి ఒక మహిళ చనిపోవడంతో జూలై 7 నుండి పరారీలో ఉన్నాడు.
ఆంధ్రప్రదేశ్ లో గత ఐదేళ్లలో వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం విద్యుత్ రంగాన్ని సర్వనాశనం చేసిందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో విద్యుత్ రంగంపై ఆయన శ్వేతపత్రం విడుదల చేశారు.
విజయవాడలో కిడ్నీ రాకెట్ మోసం బయటపడింది. గుంటూరు కేవిపి కాలనీలో ఉండే మధుబాబు చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాడు. కరోనా సమయంలో ఏం చేసినా కలిసి రాకపోవడంతో ఆటో వేసుకొని జీవనం సాగించాడు
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని భారత క్రికెట్ జట్టు ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్‌కు జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో కలిసారు. టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టు సభ్యుడయిన సిరాజ్‌ను రేవంత్‌రెడ్డి శాలువాతో సత్కరించి అభినందించారు.
నిర్ణీత సమయానికి మించి తెరిచి ఉంచినందుకు విరాట్ కోహ్లీకి చెందిన వన్8 కమ్యూన్ పబ్ మరియు ఎంజిరోడ్లోని అనేక ఇతర సంస్థలపై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పబ్ లకు అనుమతించిన సమయం రాత్రి ఒంటిగంట కాగా ఈ పబ్ లు రాత్రి 1,30 వరకు తెరిచి ఉంచడం, అర్దరాత్రి బిగ్గరగా సంగీతం వినిపిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు.
ఉత్తరప్రదేశ్ లోని హత్రాస్‌లో తొక్కిసలాటపై విచారణ జరుపుతున్న స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) సిఫారసు మేరకు యూపీ ప్రభుత్వం ఆరుగురు అధికారులను సస్పెండ్ చేసింది. సస్పెండ్ అయిన వారిలో సబ్ డివిజనల్ మేజిస్ట్రేట్ (ఎస్‌డిఎం), తహసీల్దార్, సర్కిల్ ఆఫీసర్, స్టేషన్ ఆఫీసర్ మరియు ఇద్దరు పోలీసు అవుట్‌పోస్టు ఇన్ చార్జిలు ఉన్నారు.
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ హాస్టల్ చట్నీలో ఎలుక ప్రత్యేక్షమైంది. నాణ్యతలేని భోజనం.. సాంబార్లో ఈత కొడుతున్న ఎలుకలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.