Home / తాజా వార్తలు
తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ (డీజీపీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియమితులయ్యారు. ప్రస్తుత డీజీపీ రవిగుప్తాను హోం శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
మార్పు రావాలి... కాంగ్రెస్ రావాలంటూ పలికి మొత్తానికి కాంగ్రెస్ వాళ్లు వచ్చారని... అలాగే వారు చెప్పినట్లుగా పెద్ద మార్పే తెచ్చారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఈ మేరకు కేటీఆర్ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. జేఎన్టీయూ మెస్ చట్నీలో చిట్టెలుక అనే వార్తా క్లిప్పింగ్‌ను ఆయన జోడిస్తూ... కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
హైదరాబాద్‌లోని కస్టమ్స్, ఎక్సైజ్ మరియు సర్వీస్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (CESTAT) ప్రాంతీయ బెంచ్‌లో జాయింట్ కమిషనర్‌గా పనిచేస్తున్న మహిళా ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (IRS) అధికారి పురుషుడిగా మారారు.
మహారాష్ట్రలోని ఒక ప్రొబేషనరీ ఐఏఎస్ అధికారి సివిల్ సర్వెంట్‌గా తన అధికారాన్ని దుర్వినియోగం చేశారనే ఆరోపణలపై వాషిమ్‌కు బదిలీ చేయబడింది. పూణేలో అసిస్టెంట్ కలెక్టర్‌గా పనిచేస్తున్న పూజ ఖేద్కర్ ప్రొబేషన్ అధికారులకు ఇవ్వని సౌకర్యాలను వినియోగించుకోవడంతో వివాదం చెలరేగింది.
విడాకులు తీసుకున్న ముస్లిం మహిళ తన భర్త నుండి భరణం కోరవచ్చని సుప్రీంకోర్టు బుధవారం తీర్పు చెప్పింది. విడాకుల తర్వాత తన భార్యకు భరణం చెల్లించాలనే ఆదేశాలను సవాలు చేస్తూ ఒక ముస్లిం వ్యక్తి వేసిన పిటిషన్‌ను జస్టిస్ బివి నాగరత్న, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసిహ్‌లతో కూడిన ధర్మాసనం తోసిపుచ్చి ఈ తీర్పును వెలువరించింది.
తిరుమలలో దళారీ వ్యవస్థ రాజ్యమేలుతోంది. రెండు రోజుల వ్యవధిలోనే ముగ్గురు దళారులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. తిరుమలలో గదుల దళారులను టీటీడీ విజిలెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. ముగ్గురు దళారులు నాగ బ్రహ్మచారి, కేఈ వెంకటేశ్వరరావుతో పాటు మరో వ్యక్తిని సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఇంజక్షన్ వికటించి 24 మంది అస్వస్థతకు గురైన ఘటన అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో చోటుచేసుకుంది. నక్కపల్లి ప్రభుత్వాసుపత్రిలో ఇటీవల వివిధ అనారోగ్య సమస్యలతో ఇటీవల ఆసుపత్రిలో చేరారు.
ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున ఆగ్రా-లక్నో ఎక్స్‌ప్రెస్‌వే పై బీహార్ నుంచి ఢిల్లీ వైపు వెళ్తున్న బస్సు పాల ట్యాంకర్‌ను ఢీకొనడంతో 18 మంది మృతి చెందగా, 19 మంది గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఏటీఎం కియోస్క్‌లోని క్యాష్ చెస్ట్‌ను తెరిచేందుకు కష్టపడ్డ దొంగల ముఠా చేసేదేమీ లేక మొత్తం ఏటీఎంనే ఎత్తుకెళ్లారు. మంగళవారం తెల్లవారుజామున బిచ్కుంద స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన ఏటీఎం కియోస్క్‌లోకి చొరబడిన గుర్తుతెలియని దుండగులు మెషిన్లో నగదు ఉందని గుర్తించారు
:ఉత్తరప్రదేశ్‌లోని మహారాజ్‌గంజ్ జిల్లాలో ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పథకం యొక్క మొదటి విడత పొందిన తర్వాత దాదాపు 11 మంది వివాహిత మహిళలు తమ ప్రేమికులతో పారిపోయారు.