Last Updated:

5 Best Mileage Bikes: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. టాప్ 5 బైక్స్ ఇవే..!

5 Best Mileage Bikes: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. టాప్ 5 బైక్స్ ఇవే..!

5 Best Mileage Bikes: ద్విచక్ర వాహనాల వాడకం పెరిగిపోతుంది. ముఖ్యంగా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైకులు ప్రజల్లో బాగా ప్రాచూర్యం పొందుతున్నాయి. ఎందుకంటే ఇవి తక్కువ ధరలోనే ఎక్కువ మైలేజ్‌ని అందిస్తాయి. దేశంలో ప్రజలు కూడా బడ్జెట్ సెగ్మెంట్ వాహనాలకే అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ దూరం నడిచే బైక్‌లను కొంటున్నారు. చాలా మంది యువత కూడా ఈ తరహా బైక్‌లపై ఆసక్తి చూపుతున్నారు. అలానే డెలివరీ బాయ్స్, చిన్న వ్యాపారులు, విద్యార్థులు ఈ బైక్‌లనే ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో బడ్జెట్ ధరలో అధిక మైలేజీని ఇచ్చే 5 బైకుల గురించి తెలుసుకుందాం.

1. Honda Shine 100
ఈ బైక్ మైలేజ్. లుక్‌కి ప్రసిద్ధి చెందింది. దీని ధర రూ. 62,990 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ దాదాపు 60KMPL మైలేజీని ఇవ్వగలదు. హోండా షైన్ 125 సిసిలో కూడా వస్తుంది, దీని ధర రూ. 82,151 ఎక్స్-షోరూమ్.

2. Hero HF 100
హీరో హెచ్‌ఎఫ్ డీలక్స్ దేశంలోనే అత్యంత సరసమైన మోటార్‌సైకిల్. దీని ధర రూ. 56,674 (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ లీటరుకు 70 కి.మీ మైలేజీని ఇస్తుందని కంపెనీ పేర్కొంది. గ్రామీణ ప్రాంతాల్లో ఈ బైక్‌ను ఎక్కువగా ఇష్టపడుతున్నారు.

3. TVS Sport
పొదుపుగా ఉండటమే కాకుండా యువతకు ఈ బైక్ అంటే చాలా ఇష్టం. దీని ధర రూ. 64,410 (ఎక్స్-షోరూమ్). ఇందులో 109 సిసి సింగిల్ సిలిండర్ పెట్రోల్ ఇంజన్ కలదు. టీవీఎస్ స్పోర్ట్ లీటరుకు 70 కి.మీ మైలేజీని ఇవ్వగలదని కంపెనీ పేర్కొంది.

4. Bajaj Platina
బజాజ్ ప్లాటినా 100, 110 సిసి సెగ్మెంట్లలో అందుబాటులో ఉంది. దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.66,840. ఇది ఒక వేరియంట్, నాలుగు కలర్ ఆప్షన్లలో వస్తుంది. ఈ బైక్ 70 KMPL మైలేజీని ఇవ్వగలదని బజాజ్ పేర్కొంది.

5. Bajaj Freedom 125 CNG
ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి CNG బైక్. మీరు దీనిని పెట్రోల్, CNG ఇంధనంతో నడపవచ్చు. ఇండియన్ మార్కెట్లో దీని ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.90 వేలు. బజాజ్ ఫ్రీడమ్ 125 CNG బైకులో 125cc సింగిల్ సిలిండర్ ఇంజన్ అమర్చారు.

ఈ ఇంజన్ 9.5 పీఎస్ పవర్, 9.7 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేయగలదు. ఈ బైక్ సిఎన్‌జిపై కిలోకు 102 కిమీ, పెట్రోల్‌పై లీటరుకు 64 కిమీ మైలేజీని ఇస్తుందని బజాజ్ పేర్కొంది. CNG+ పెట్రోల్‌తో ఈ బైక్ 330 కిలోమీటర్ల రేంజ్ ఇవ్వగలదు.