Home / తాజా వార్తలు
సంగారెడ్డి జిల్లా సుల్తాన్పూర్ జేఎన్టీయూ ఇంజనీరింగ్ కళాశాల క్యాంపస్ హాస్టల్ చట్నీలో ఎలుక ప్రత్యేక్షమైంది. నాణ్యతలేని భోజనం.. సాంబార్లో ఈత కొడుతున్న ఎలుకలతో విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు.
మంత్రి పొన్నం ప్రభాకర్‌కు కోపం వచ్చింది. హైదరాబాద్ బల్కంపేట ఆలయంలో అమ్మవారి కళ్యాణం సందర్భంగా ఆలయం వద్ద జరిగిన తొక్కిసలాటపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భక్తుల రద్దీ, తోపులాట అధికం కావంతో మంత్రి పొన్నం ప్రభాకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లో ముజ్రా పార్టీని పోలీసులు భగ్నం చేశారు. 12 మంది యువకులతో పాటు నలుగురు యువతుల అరెస్ట్ చేశారు. ముజ్రా పార్టీ కోసం నలుగురు యువతులను ఢిల్లీ నుంచి పిలిపించారు. ఫామ్‌హౌస్‌లో యువతీయువకుల అసభ్యకర నృత్యాలు చేస్తుండగా ఎస్వోటీ పోలీసులు పట్టుకున్నారు.
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమ ఆస్తుల కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టులో పారిశ్రామికవేత్త నిమ్మగడ్డ ప్రసాద్‌కు తెలంగాణ హైకోర్టులో చుక్కెదురయింది. వాన్‌పిక్ ఛార్జిషీటు నుంచి అతని పేరును తొలగించేందుకు నిరాకరించిన కోర్టు, అభియోగాలను రద్దు చేయాలంటూ ఆయన వేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
నల్గొండ జిల్లా కొర్లపాడు టోల్ ప్లాజా వద్ద ట్రామా కేర్ సెంటర్‌కు రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి శంకుస్దాపన చేసారు. ఏడీపీ ఇండియా తెలంగాణ ప్రభుత్వంతో కలిసి దీనిని నిర్మిస్తోంది.హైదరాబాద్-విజయవాడ హైవే (NH 65) పై రోడ్డు ప్రమాద బాదితులకు తక్షణ చికిత్సను అందించడం లక్ష్యంగా దీనిని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
ఏపీలో నేటి నుంచి ఉచిత ఇసుక విధానం అమల్లోకి రానుంది. దీనిపై సీఎం చంద్రబాబు ఆదేశాలకు అనుగుణంగా అధికార యంత్రాంగం కార్యాచరణను సిద్ధం చేసింది. మొదట అన్ని జిల్లాల్లోని నిల్వ కేంద్రాల్లో ఉన్న ఇసుక డంప్‌ల నుంచి ఇసుకను అందజేస్తుంది.
కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సోమవారం అసోంకు చేరుకుని లఖిపూర్‌లోని ఫులెర్తాల్ సహాయ శిబిరంలో వరద బాధిత బాధితులను పరామర్శించారు. ముందగా సిల్చార్ జిల్లాలోని కుంభిగ్రామ్ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ అక్కడనుంచి లఖిపూర్‌లోని వరద సహాయ శిబిరానికి చేరుకున్నారు.
ఉత్తరాఖండ్ రిషికేశ్ లోని గంగా ఘాట్ల వద్ద విదేశీ మహిళలు బికినీలు ధరించి ఎంజాయ్ చేస్తున్న వీడియో వైరల్‌గా మారింది. పవిత్ర గంగా నదిలో స్విమ్సూట్లతో వారు ఆడుతున్న దృశ్యాలను చూపే ఫుటేజీకి వీక్షకుల నుండి మిశ్రమ స్పందనలు వచ్చాయి.
ఇండోనేషియాలోని సెంట్రల్ ద్వీపం సులవేసిలో ఒక అక్రమ బంగారు గని సమీపంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 11 మంది మరణించగా 19 మంది తప్పిపోయినట్లు ఒక అధికారి తెలిపారు.
ఉక్రెయిన్ లోని కీవ్ నగరంలో పిల్లల ఆసుపత్రిపై రష్యా చేసిన భారీ వైమానిక దాడలో 20 మంది మరణించారు. సెంట్రల్ ఉక్రెయిన్ నగరమైన క్రివీ రిహ్‌లో జరిగిన మరో దాడిలో కనీసం 10 మంది మరణించారు. ఈ దాడి గత కొద్దినెలలుగా జరగుుతున్న దాడుల్లో అతిపెద్దదాడిగా చెప్పవచ్చు.