Home / తాజా వార్తలు
జమ్ము కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాకు మరిన్ని అధికారాలను కల్పిస్తూ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ జమ్ము కశ్మీర్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2019 నిబంధనలను సవరించింది.
ఉత్తర-మధ్య నైజీరియాలో శుక్రవారం ఉదయం రెండంతస్తుల పాఠశాల భవనం కూలిపోవడంతో 20 మందికి పైగా విద్యార్థులు మరణించగా, పలువురు గాయపడ్డారు, శిధిలాలకింద 100 మందికి పైగా చిక్కుకున్నారని వారి కోసం గాలిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
అక్రమ అబార్షన్లు చేస్తూ భ్రూణ హత్యలకు పాల్పడుతున్న హుజురాబాద్ పట్టణంలోని శ్రీ మాధవి నర్సింగ్ హోంను సీజ్ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు రాత్రి జిల్లా వైద్య శాఖ అధికారులు సీజ్ చేశారు.
ఏపీ సీఎం చంద్రబాబు మంగళగిరిలోని కొలనుకొండలోని హరేకృష్ణ గోకుల క్షేత్రానికి వెళ్లారు. వెంకటేశ్వర ఆలయ నిర్మాణంలో భాగంగా గర్భాలయంలో అనంతశేష స్థాపన కార్వహించారు.. అనంతరం పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
తాను చనిపోతున్నానంటూ అర్ధరాత్రి హైటెన్షన్ క్రియేట్ చేసింది రాజ్ తరుణ్ లవర్ లావణ్య. తాను ఈ లోకం నుండి వెళ్లిపోతున్నానంటూ అడ్వొకేట్ కు మెసేజ్ చేసింది. దీంతో స్పందించిన అడ్వొకేట్ డయల్ 112 ద్వారా నార్సింగి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
నేపాల్ ప్రధాన మంత్రి పుష్ప కమల్ దహల్ 'ప్రచండ' శుక్రవారం పార్లమెంటులో తన ప్రభుత్వం పై పెట్టిన అవివిశ్వాస తీర్మానంలో ఓటమి పాలయ్యారు. ప్రభుత్వానికి అనుకూలంగా 63 ఓట్లు రాగా వ్యతిరేకంగా 194 ఓట్లు వచ్చాయి.
ఇకపై ప్రతి సంవత్సరం జూన్ 25వ తేదీని 'సంవిధాన్ హత్యా దివస్'గా నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది. 1975 జూన్ 25న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఉత్తర మెక్సికన్ రాష్ట్రమైన తమౌలిపాస్‌లోని పట్టణ ప్రాంతంలో సుమారుగా 200 మొసళ్ళు ప్రవేశించాయని అధికారులు తెలిపారు. జాన్ నుంచి ఇప్పటి వరకు బెరిల్ హరికేన్ ఇతర తుఫాన్లతో ఇక్కడ కుండపోత వర్షాలు కురిసాయి
జపాన్‌లోని యమగటా ప్రిఫెక్చర్లో స్థానిక ప్రభుత్వం శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి ప్రజలు ప్రతిరోజూ కనీసం ఒక్కసారైనా నవ్వాలని పిలుపునిస్తూ ఆర్డినెన్స్‌ను ఆమోదించింది.
తెలంగాణలో బ్రాహ్మణ సంక్షేమ కార్యక్రమాలను వెంటనే పునరుద్ధరించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి హరీష్ రావు ముఖ్యమంత్రి ఎ రేవంత్ రెడ్డిని కోరారు. నాటి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నేతృత్వంలోని గత పరిపాలనలో ఏర్పాటైన తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్ ప్రస్తుత పరిస్థితిపై హరీశ్‌రావు ముఖ్యమంత్రికి రాసిన లేఖలో తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.