Home / తాజా వార్తలు
Deputy CM Pawan Kalyan visit to Pinakota Panchayat Ballagaru: ఏజెన్సీ ప్రాంతాల్లోని గిరిజనుల జీవితాల్లో మార్పు వచ్చే వరకు తాను రాజకీయాల నుంచి రిటైర్ కానని, చిట్టచివరి గిరిజన గూడేనికీ ఇకపై డోలీ అవసరం రాకుండా ఉండేలా వసతులు కల్పించి తీరతానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రకటించారు. మన్యంలో తన రెండవ రోజు పర్యటనలో భాగంగా శనివారం అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పినకోట పంచాయతీ బల్లగరువులో పవన్ పర్యటించారు. […]
Telangana Legislative Council Session 2024: తెలంగాణ శాసనమండలిలో శనివారం మూడు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, జీహెచ్ఎంసీ సవరణ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ బిల్లులకు మండలి ఆమోద ముద్ర వేసింది. రాష్ట్రంలోని 80 పంచాయతీలను మున్సిపాలిటీలుగా మారుస్తామని ఇదివరకే ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో మున్సిపాలిటీ సవరణ బిల్లుకు గ్రీన్ సిగ్నల్ వచ్చింది. అలాగే ఈసీ ట్రిబ్యునల్ సవరణ మేరకు పంచాయతీరాజ్ చట్టం షెడ్యూల్ 8 లోని 140 పంచాయతీల సవరణకు […]
BRS Working President KTR Criticized CM Revanth Reddy: కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని బెదిరింపులు చేసినా భయపడేది లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గత అసెంబ్లీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటం చేతగాని కాంగ్రెస్ ప్రభుత్వం విపక్షాలను బెదిరించే పనికి దిగుతోందని, తాను ఈడీ, మోడీకి భయపడబోనని వ్యాఖ్యానించారు. నేటికీ 100 శాతం రైతు రుణమాఫీ అమలు కాలేదని ఆరోపించారు. ప్రభుత్వం కాకి లెక్కలు […]
Telangana Govt Extends Deadline for Kaleshwaram commission: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం బ్యారేజిల్లో అవకతవకలపై న్యాయ విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ.ఘోష్ కమిషన్ గడువును ప్రభుత్వం శనివారం మరోసారి పొడిగించింది. ఈ నెల 31 వరకే కమిషన్‌కు గడువు ఉండటంతో మరో రెండు నెలలపాటు ఫిబ్రవరి 28వ తేదీ వరకు గడువు పెంచుతూ ఇరిగేషన్, కాడ్ కార్యదర్శి రాహుల్ బొజ్జా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి నుంచి పనిలో.. కాళేశ్వరం కమిషన్ కి జస్టిస్ పీసీ […]
Prime Minister Narendra Modi arrives in Kuwait: ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల అధికార పర్యటన నిమిత్తం శనివారం కువైట్ చేరుకున్నారు. కువైట్ పాలకుడు షేక్ మిషాల్ అల్అహ్మద్ అల్ జుబేర్ అల్ సబహ్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడ పర్యటిస్తున్నారు. కాగా, భారత ప్రధాని కువైట్‌కు 43 ఏళ్ల తర్వాత వెళ్లటం, సిరియా ఉద్రికత్తల నేపథ్యంలో ప్రధాని పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. అప్పట్లో 1981లో చివరిసారిగా ఇందిరాగాంధీ కువైట్‌లో పర్యటించిన సంగతి తెలిసిందే. […]
New Technology Tyres: ప్రపంచంలోని రెండవ అతిపెద్ద టైర్ తయారీ కంపెనీ మిచెలిన్-అమెరికన్ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్ పంక్చర్ ప్రూఫ్ ఎయిర్‌లెస్ టైర్‌ను అభివృద్ధి చేశాయి. 5 సంవత్సరాల క్రితం MovinOn ట్రాన్స్పోర్ట్ సమ్మిట్‌లో కంపెనీ తన డిజైన్‌ను ప్రదర్శించింది. అప్పటి నుంచి దీని ప్రారంభానికి సంబంధించిన వార్తలు వచ్చాయి. అయితే ఇంకా మార్కెట్లోకి రాలేకపోయింది. ఈ టైర్ ప్రత్యేకత ఏమిటంటే, దీనికి ట్యూబ్ లేదు గాలి కూడా ఉండదు. టైర్ పంక్చర్‌ను నివారించడానికి […]
Flipkart Big Saving Days: బిగ్ సేవింగ్స్ డేస్ సేల్ ఇప్పుడు ప్రముఖ ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో లైవ్ అవుతుంది. ఇందులో ఎంపిక చేసిన మొబైల్లపై భారీ తగ్గింపులను ప్రకటించింది. మోటరోలా G85 5జీ ఫోన్ ఫ్లిప్‌కార్ట్ వెబ్సైట్ బిగ్ సేవింగ్స్ డే సేల్‌లో అందుబాటులో ఉంది. 14 శాతం తగ్గింపు ధరతో కొనుగోలు చేయచ్చు. ఇప్పుడు కస్టమర్లు ఈ ఫోన్ 8 GB RAM + 128 GB స్టోరేజ్ వేరియంట్‌ను రూ. 17,999కి దక్కించుకోవచ్చు. అందులోనూ […]
Legal Notice to Ram Gopal Varma: వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరోసారి ఏపీ ప్రభుత్వం షాకిచ్చింది. తాజాగా ఆయనకు మరోసారి నోటీసులు ఇచ్చింది. ఆర్జీవీ దర్శకత్వంతో తెరకెక్కిన ‘వ్యూహం’ సినిమా వ్యవహరంలో చిత్ర బ్రందంతో పాటు వర్మకు, ఫైబర్ నెట్ మాజీ ఎండీకి కూడా ప్రభుత్వం లీగల్ నోటీసులు ఇచ్చింది. వ్యూహం సినిమాకు.. ఫైబర్ నెట్టి నుంచి రూ. 1.15 కోట్ల అనుచిత లబ్ధి పొందారని ఫైబర్ నెట్ కార్పొరేషన్ ఛైర్మన్ తెలిపారు. […]
Best Budget SUV: భారత మార్కెట్లో సరసమైన ధర కలిగిన కాంపాక్ట్ ఎస్‌యూవీలకు భారీ డిమాండ్ ఉంది. ముఖ్యంగా టయోటా అర్బన్ క్రూయిజర్ టైజర్ ఫ్యామిలీ ఎస్‌యూవీగా బాగా నచ్చింది. ఈ ఎస్యూవీ ప్రారంభ ధర 8 లక్షల కంటే తక్కువ, దీని మైలేజ్ కూడా అద్భుతంగా ఉంటుంది. మీరు సమీప భవిష్యత్తులో ఒక SUVని కొనాలనే ప్లాన్ ఉంటే Taserని పరిగణించవచ్చు. దీని పూర్తి వివరాలపై ఓ లుక్కేద్దాం. Toyota Urban Cruiser Price And […]
5G Mobiles Under 10K: ఈ కామర్స్ వెబ్సైట్ ఫ్లిప్‌కార్ట్ ఆఫర్ల వర్షం కురిపిస్తోంది. సరికొత్త ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్‌లో స్మార్ట్ఫోన్లపై అదిరిపోయే డిస్కౌంట్లు అందిస్తోంది. అంతే కాకుండా రూ.10 వేల బడ్జెట్లోనే ప్రీమియం 5జీ ఫోన్లను కొనుగోలు చేసే అవకాశాలు కల్పిస్తోంది. ఈ జాబితాలో సామ్సంగ్, వివో, మోటో, పోకో వంటి బ్రాండ్లు ఉన్నాయి. రండి ఈ మొబైల్స్‌పై అందుబాటులో ఉన్న డీల్స్ గురించి తెలుసుకుందాం. 1.Samsung Galaxy A14 5G సేల్‌లో […]