Last Updated:

Best Selling 5G Smartphone: సామ్‌సంగ్ గెలాక్సీ A14 5జీ.. దేశంలో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్.. రూ.10 వేల కంటే తక్కువ ధరకే..!

Best Selling 5G Smartphone: సామ్‌సంగ్ గెలాక్సీ A14 5జీ.. దేశంలో బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్‌ఫోన్.. రూ.10 వేల కంటే తక్కువ ధరకే..!

Best Selling 5G Smartphone: మీరు కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేస్తుంటే 5G కనెక్టివిటీ ఉన్న ఫోన్‌ను కొనుగోలు చేయడం మంచిది. జియో, ఎయిర్టెల్ 5జీ సపోర్ట్‌తో స్మార్ట్‌ఫోన్‌ను కలిగి ఉన్న సబ్‌స్క్రైబర్‌లకు మాత్రమే అన్‌లిమిటెడ్ 5G డేటా ప్రయోజనాన్ని అందిస్తున్నాయి. అటువంటి పరిస్థితిలో మీ బడ్జెట్ తక్కువగా ఉంటే కస్టమర్లు బెస్ట్ సెల్లింగ్ బడ్జెట్ 5G ఫోన్ సామ్‌సంగ్ గెలాక్సీ A14 5జీని రూ. 10,000 కంటే తక్కువకు కొనుగోలు చేసే అవకాశాన్ని పొందుతున్నారు. దీని పూర్తి వివరాలను తెలుసుకుందాం.

సామ్‌సంగ్ గెలాక్సీ A14 5జీ ఆన్‌లైన్ షాపింగ్ ప్లాట్‌ఫామ్ ఫ్లిప్‌కార్ట్‌లో తగ్గింపు ధరతో జాబితా చేశారు. 50MP ట్రిపుల్ కెమెరా సెటప్ కాకుండా ఈ మొబైల్ పెద్ద డిస్‌ప్లే,  5000ఎమ్ఏహెచ్ శక్తివంతమైన బ్యాటరీని కలిగి ఉంది. పూర్తిగా ఛార్జ్ చేసినప్పుడు అది రెండు రోజుల వరకు బ్యాకప్‌ను అందించగలదని బ్రాండ్ పేర్కొంది. గెలాక్సీ A14 5G జనవరి 2023 నుండి జూలై 2024 వరకు అత్యధికంగా అమ్ముడైన 5G ఫోన్ అని కౌంటర్ పాయింట్ తన పరిశోధన నివేదికలో పేర్కొంది.

Samsung Galaxy A14 5G Offers
6GB RAM+128GB స్టోరేజ్ ఉన్న సామ్‌సంగ్ మొబైల్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 10,999కి అందుబాటులో ఉంది. అయితే ఇతర కస్టమర్‌లు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ సహాయంతో చెల్లిస్తే, వారికి 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. దీని తర్వాత స్మార్ట్‌ఫోన్ ధర రూ.10,000 అవుతుంది. విశేషమేమిటంటే ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ తగ్గింపు కూడా అందిస్తున్నారు.

కస్టమర్లు గరిష్టంగా రూ.7,500 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపును పొందచ్చు. అయితే ఎక్స్‌ఛేంజ్ డీల్ విషయానికి వస్తే.. అది మీ పాత ఫోన్ మోడల్, పర్ఫామెన్స్‌పై ఆధారపడి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ని బ్లాక్, డార్క్ రెడ్, లైట్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌లో ఆర్డర్ చేయచ్చు.

Samsung Galaxy A14 5G Specifications
సామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్ 6.6-అంగుళాల LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 90Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌ను అందిస్తుంది. బలమైన పనితీరు కోసం, ఫోన్ Exynos 1330 ప్రాసెసర్. 13MP ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. వెనుక ప్యానెల్‌లోని ప్రాథమిక సెటప్‌లో 2MP మాక్రో, 2MP డెప్త్ సెన్సార్‌లతో పాటు 50MP మెయిన్ సెన్సార్ ఉంది. ఈ ఫోన్ 5000mAh బ్యాటరీకి 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అందిస్తుంది. ఇది భద్రత కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కలిగి ఉంది.