Home / తాజా వార్తలు
ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై తెరాసా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండు గంటలుగా విచారిస్తున్నారు.
తిరుమలలో జరిగేది శ్రీవారి బ్రహ్మోత్సవాలా? సీఎం జగనోత్సవాలా? అంటూ తెలుగుదేశం నేతలు ఆరోపించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు తెదేపా నేతలను అరెస్ట్ చేసిన చంద్రగిరి పోలీసు స్టేషన్ కు తరలించారు
మెన్ ఆఫ్ మాసెస్ గా పేరుతెచ్చుకున్న బాలయ్య ‘అఖండ’ చిత్రంతో నందమూరి అభిమానుల్లో ఫుల్ జోష్ నింపాడు. అయితే ప్రస్తుతం బాలయ్య హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో పొలిటికల్ టచ్ ఉన్న మాస్ యాక్షన్ మూవీని చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్‌కి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.
అమరావతి రైతుల పాదయాత్రను అడ్డుకొనేందుకు 5నిమిషాలు పట్టదు అంటున్న మంత్రి బొత్స సత్యన్నారాయణపై తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు ఆగ్రహం వ్యక్తం చేసారు.
పర్యావరణ ఉల్లాంఘనలకు రూ. 120కోట్ల రూపాయలను రుసుము కింద చెల్లించాలని ఎన్జీటి తీర్పు పై ఏపీ ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేసిన కేసు వాదనల సమయంలో న్యాయవాదులకు ఎంతమేర ప్రభుత్వం చెల్లించిందో అన్న అంశం పై నోటీసు ఇస్తామని పేర్కొన్న విషయం పై రాష్ట్ర వ్యాప్తంగా చర్చగా మారింది.
వినియోగదారులకు గుడ్ న్యూస్ చెప్పిన వాట్సాప్. ఈ వారంలో సరికొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తెస్తున్నట్టు పేర్కొనింది. 32 మందితో ఒకేసారి గ్రూప్ వీడియో కాల్స్ మాట్లాడే సదుపాయాన్ని ఈ వారంలో అందుబాటులోకి తేనున్నట్టు తెలుస్తోంది.
రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్‌కు విధేయులైన 90 మందికి పైగా రాజస్థాన్ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయడంతో కాంగ్రెస్ అధ్యక్షపదవిరేసునుంచి అశోక్ గెహ్లాట్ తొలగించబడ్డారు.
ఇస్లామిక్ సంస్థ పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా (పిఎఫ్ఐ) సంస్థ పై రెండవ రౌండ్ దేశవ్యాప్త దాడులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 247 మందిని అరెస్టు చేశారు. మధ్యప్రదేశ్, కర్ణాటక, అస్సాం, ఢిల్లీ, మహారాష్ట్ర, తెలంగాణ మరియు ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో ఎన్ఐఎ సోదాలు జరుగుతున్నాయి.
భారత్, ఇంగ్లండ్ మహిళల మ్యాచ్‌లో దీప్తి శర్మ చేసిన రనౌట్ వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. షార్లెట్ డీన్.. నాన్‌స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా దీప్తి శర్మ మన్కడ్ చేసింది. దీనికి సంబంధించి ఓ క్రికెట్ అనలిస్ట్ చేసిన అనాలసిస్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే..
మహారాష్ట్ర ఏటీఎస్ పోలీసుల దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దసరా ఉత్సవాల్లో హింసకు పీఎఫ్ఐ భారీ కుట్ర చేసినట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. నాగపూర్ అర్ ఎస్ ఎస్ కార్యాలయం వద్ద పీఎఫ్ఐ నేతలు రెక్కీ నిర్వహించినట్లు అధికారులు గుర్తించారు.