Last Updated:

BalaKrishna: నెట్టింట బాలయ్య సందడి.. NBK107 షూటింగ్ వీడియో వైరల్

మెన్ ఆఫ్ మాసెస్ గా పేరుతెచ్చుకున్న బాలయ్య  ‘అఖండ’ చిత్రంతో నందమూరి అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపాడు. అయితే ప్రస్తుతం బాలయ్య హీరోగా గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో పొలిటిక‌ల్ ట‌చ్ ఉన్న మాస్ యాక్ష‌న్ మూవీని చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా షూటింగ్కి సంబంధించి ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.

BalaKrishna: నెట్టింట బాలయ్య సందడి.. NBK107 షూటింగ్ వీడియో వైరల్

Tollywood: మెన్ ఆఫ్ మాసెస్ గా పేరు తెచ్చుకున్న బాలయ్య  ‘అఖండ’ చిత్రంతో నందమూరి అభిమానుల్లో ఫుల్‌ జోష్‌ నింపాడు. గతేడాది విడుదలైన ఈ చిత్రం తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ బ్లాక్‌ బాస్టర్‌గా నిలవడమే కాకుండా బాలయ్య వంద కోట్ల క్లబ్‌లో చేరాడు. ప్ర‌స్తుతం అదే జోష్‌తో బాలకృష్ణ తన తర్వాతి చిత్రాల షూటింగ్ను శరవేగంగా పూర్తి చేస్తున్నాడు. బాలయ్య హీరోగా గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో పొలిటిక‌ల్ ట‌చ్ ఉన్న మాస్ యాక్ష‌న్ మూవీని చేస్తున్నాడు.

అయితే ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుద‌లైన బాలయ్య పోస్ట‌ర్‌లు ప్రేక్ష‌కుల‌ ఆదరణ పొందాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమా విడుద‌ల‌వుతుందా అని బాలయ్య అభిమానులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్‌ టర్కీలో జరుగుతున్న క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఈ వీడియోలో బాలయ్యకు రౌడీలకు మధ్య ఫైటింగ్‌ జరుగుతుంది. బాలయ్య ఓ రౌడీ చేయి నరికి అటు ఇటు తిరుగుతున్నాడు. బాలయ్యను చూస్తూ రౌడీలంతా అటు భయంతో ఇటు కోపంతో రగిలిపోతున్నారు. కాగా ఈ సినిమాకు ఎస్ఎస్‌. థ‌మ‌న్ సంగీతాన్ని సమకూర్చుతుండగా నటసింహం బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్ న‌టిస్తుంది. క‌న్న‌డ యాక్ట‌ర్ దునియా విజ‌య్ విలన్ గా న‌టిస్తున్నాడు. అయితే ఈ చిత్రానికి ‘జై బాల‌య్య’ అనే టైటిల్ దాదాపు క‌న్ఫార్మ్ అయిన‌ట్లు తెలుస్తుంది.

ఇదీ చదవండి: డార్లింగ్ ఫ్యాన్స్ కు క్రేజీ అప్డేట్.. అయోధ్యలో ఆదిపురుష్ టీజర్..!

ఇవి కూడా చదవండి: