Last Updated:

Manchireddy Kishan Reddy: ఈడీ విచారణలో తెరాసా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై తెరాసా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండు గంటలుగా విచారిస్తున్నారు.

Manchireddy Kishan Reddy: ఈడీ విచారణలో తెరాసా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి

Hyderabad: ఫెమా నిబంధనలు ఉల్లంఘించారనే అభియోగాలపై తెరాసా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డిని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు రెండు గంటలుగా విచారిస్తున్నారు. ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే పై ఈడీ అధికారులు కేసు నమోదుచేశారు. నిన్నటిదినం ఆయనకు నోటీసును అధికారుల అందచేసారు. ఈ క్రమంలో హైదరాబాదులో ఈడీ ఆఫీసులో విచారణకు వచ్చిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి బ్యాంకు లావాదేవీలకు సంబంధించి వివరాల పై అధికారులు ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది.

విదేశీ వాణిజ్యం, చెల్లింపులను సులభతరం చేయడం, విదేశీ మారక మార్కెట్ యొక్క క్రమబద్ధమైన అభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతో, భారత ప్రభుత్వం 1999 లో విదేశీ మారక నిర్వహణ చట్టం (ఫెమా) ను ఆమోదించింది. అనంతరం చట్టంలో చేసిన మార్పుల నేపధ్యంలో ఫెమా జూలై 2005 లో ఉనికిలోకి వచ్చిన మనీ లాండరింగ్ నిరోధక చట్టం, 2002 ప్రవేశానికి మార్గం సుగమం చేసింది. ఈ చట్టం మేరకు తెరాసా శాసనసభ్యుడు ఫెమా ఉల్లంఘనలకు పాల్పొడినట్లుగా కేసు నమోదైవుంది.

ఇది కూడా చదవండి: వెంకన్న బ్రహ్మోత్సవాలా? జగనోత్సవాలా?

ఇవి కూడా చదవండి: