Today Horoscope January 28: నేటి రాశి ఫలాలు.. ఈ రాశి వారికి ఊహించని అభివృద్ధి!

Horoscope Today in Telugu January 28: మొత్తం 12 రాశులు. ఏ రాశి వారికి ఎలా ఉంది? ఏ రాశి వారికి అనుకూలంగా ఉంటుంది? వంటి వాటిపై జ్యోతిష్యులు పలు విషయాలు వెల్లడించారు.
మేషం – అనుకున్న ముఖ్యమైన కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేయడానికి విశేషమైన కృషి చేస్తారు. పెట్టుబడులు కీలకమైన చర్చలు ముఖ్యమైన ప్రయాణాలలో నిదానంగా వ్యవహరించండి.
వృషభం – మీలోని సృజనాత్మకత వెలుగు చూస్తుంది. వృత్తి – ఉద్యోగాలపరంగా మీ స్థాయి యధాతధంగా ఉంటుంది. భాగస్వామ్య వ్యాపారస్తులకు మినహా ఇతరులకు అనుకూలంగా ఉంటుంది.
మిథునం – పనులు సకాలంలో పూర్తి చేస్తారు. పలువురు ప్రశంసించే విధంగా మీ నడవడిక ఉంటుంది. అనుకూల ఫలితాలు ఎక్కువగా సాధించడానికి చాలా కృషి చేస్తారు.
కర్కాటకం – మనోధైర్యం ఆత్మవిశ్వాసం పెంపొందించుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాల్లొ నిదానంగా వ్యవహరించండి. ఆర్థికంగా పూర్తిస్థాయిలో కాకపోయిన కొంతవరకు ఊరట కలిగించే విధంగా ఉంటుంది.
సింహం – పరోపకార బుద్ధి కలిగి ఉంటారు. అన్ని విషయాల్లో అదృష్టానికి శుభానికి దగ్గరగా జీవితం నడుస్తుంది అనే విధంగా ఉంటుంది. మీ మంచితనాన్ని చేతగానితనం అనుకున్న వారికి తగిన విధంగా బుద్ధి చెపుతారు.
కన్య – చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారపరంగా లాభాలు రొటేషన్ పద్ధతిలో ఉంటాయి.
తుల – ఆర్థిక పరమైన ఇబ్బందుల నుంచి తాత్కాలికంగా బయటపడగలుగుతారు. సంతానం యొక్క యోగక్షేమల పట్ల అధిక శ్రద్ద కనపరచవలసి వస్తుంది. కార్యాలయంలో పని భారం అధికంగా ఉంటుంది.
వృశ్చికం – పరిస్థితులకు లోబడి ఇష్టం లేకపోయిన సరే కొన్ని పనులను పూర్తిచేస్తారు. వృత్తి- ఉద్యోగాల పరంగా స్వల్పమైన ఇబ్బందులు తప్పకపోవచ్చు. కొంత ఓర్పు, సహనం కలిగి ఉండాలి.
ధనుస్సు – ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు పెరిగిన సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. మీ ప్రణాళికలో మార్పులు చేర్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.
మకరం – వృత్తి- వ్యాపారాలలో ఊహించని అభివృద్ధి సాధిస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించి ముందుకు సాగుతారు. ఈ రాశి వారికి మార్కెట్ విషయంలో ప్రోత్సాహం లభిస్తుంది.
కుంభం – ఉద్యోగాలలో కొంత ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయి. రాజకీయాల పట్ల ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తారు. మిత్ర బృందాలను మరింతగా విస్తరింపజేస్తారు. పెండింగ్‌లో ఉన్న రుణాలను కొంతవరకు చెల్లిస్తారు.
మీనం – వృత్తి- ఉద్యోగాలపరంగా సంతృప్తికరమైన ఫలితాలు పొందుతారు. శుభకార్యాలకు సంబంధించిన చర్చలు పురోభివృద్ధిలో ఉంటాయి. వ్యక్తిగత హోదా పెంపొందుతుంది.