Traffic restrictions in Hyderabad tomorrow : మోదీ టూర్.. రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు
భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్న నేపధ్యంలో రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపుమధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్పుర, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది.
Hyderabad: భారత ప్రధాని నరేంద్ర మోడీ రేపు తెలంగాణలో పర్యటించనున్న నేపధ్యంలో రేపు హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. రేపుమధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆంక్షలు ఉండనున్నాయి. పంజాగుట్ట, గ్రీన్ ల్యాండ్స్, ప్రకాష్ నగర్, రసూల్పుర, ప్యాట్నీ సిగ్నల్ వరకు ట్రాఫిక్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. సోమాజిగూడ, రాజ్ భవన్ రోడ్డు, ఖైరతాబాద్ జంక్షన్ వరకు ట్రాఫిక్ ఉండే అవకాశాలు ఉన్నాయి. రేపు మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ఈ రూట్లలో కాకుండా వేరే రూట్లను ఎంచుకోవాలని ట్రాఫిక్ పోలీసులు సూచిస్తున్నారు.
ప్రధాని మోదీ మధ్యాహ్నం 12:25 గంటలకు విశాఖపట్నం నుండి భారత వాయుసేన ప్రత్యేక విమానంలోతెలంగాణకు బయలుదేరుతారు. మధ్యాహ్నం 1:30 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో దిగుతారు. అనంతరం బిజెపి స్వాగత సభలో పాల్గొంటారు. అనంతరం గం.2.15 కు హెలికాప్టర్‌లో ప్రధాని రామగుండం బయలుదేరివెళ్లనున్నారు. మధ్యాహ్నాం 3.30కు రామగుండం ఎరువులు, రసాయనాల పరిశ్రమ (ఆర్‌ఎఫ్‌సీఎల్)ను ప్రధాని మోదీ ప్రారంభిస్తారు. సాయంత్రం పలు ప్రాజెక్టులకు మోదీ శంకుస్థాపన చేస్తారు. అనంతరం రామగుండంలోని ఎన్టీపీసీ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు.