Kerala High Court: నగ్నత్వం, అశ్లీలత రెండూ ఒకటి కావు.. కేరళ హైకోర్ట్ సంచలన నిర్ణయం
Kerala High Court: కేరళకు చెందిన మహిళ మోడల్ రెహనా ఫాతిమా(33)కు కేరళ హైకోర్ట్ ఊరటనిచ్చింది. తనపై ఉన్న కేసులను ఎత్తివేసింది. కొద్ది రోజుల క్రితం రెహానా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.
Kerala High Court: కేరళకు చెందిన మహిళ మోడల్ రెహనా ఫాతిమా(33)కు కేరళ హైకోర్ట్ ఊరటనిచ్చింది. తనపై ఉన్న కేసులను ఎత్తివేసింది. కొద్ది రోజుల క్రితం రెహానా సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో తీవ్ర చర్చనీయాంశం అయ్యింది. ఆ వీడియోలో ఆమె పడుకుని ఉండగా.. అర్ధనగ్న శరీరంపై మైనర్లైన ఆమె కుమారుడు, కుమార్తె ఆమె ఒంటిపై పెయింటింగ్ వేస్తున్న దృశ్యాలు ఉన్నాయి. ఈ ఘటనపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇదేం ఘటన అంటూ పోక్సో, జువెనైల్ జస్టిస్ యాక్ట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టాల కింద ఆమెపై కేసులు నమోదు చేశారు. ఆయా కేసుల నుంచి తనకు విముక్తి కల్పించాలంటూ రెహనా ట్రయల్ కోర్టును ఆశ్రయించగా న్యాయస్థానం దానికి అంగీకరించలేదు. దానితో ఆమె హైకోర్టుకు వెళ్లింది. కాగా తాజాగా ఈ కేసుపై విచారణ జరిపిన కేరళ హైకోర్టు.. ఆమె తన శరీరాన్ని తన పిల్లల కాన్వాసలా ఉపయోగించుకోనిచ్చింది. అంతే తప్ప తన లైంగిక ఉద్రేకాలను తృప్తిపరచుకోవడానికి తన పిల్లలను ఉపయోగించుకున్నట్టు భావించకూడదని అందులో పేర్కొంది. ఒక మహిళ నగ్న శరీరాన్ని ఎల్లప్పుడూ లైంగికంగా లేదా అశ్లీల దృష్టితో చూడకూడదని.. తల్లి సెమీ నగ్నంగా ఉండి తన పిల్లలు తన శరీరంపై పెయింటింగ్‌ను చిత్రీకరించినందుకు ఒక మహిళను క్రిమినల్ కేసు పెట్టడం సరికాదని.. వెంటనే కేసులను ఎత్తివేయాలని కేరళ హైకోర్టు ఆదేశించింది.
ఆ రెండూ ఒకటి కాదు(Kerala High Court)
పురుషుడి శరీరంలో పైభాగం నగ్నంగా ఉన్నా దాన్ని లైంగిక దృష్టితో చూడని సమాజం.. మహిళ విషయంలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తోందని, ఆ భావనను ధిక్కరించేందుకే తాను ఆ బాడీ పెయింటింగ్ వీడియో పెట్టానంటూ రెహనా ఫాతిమా ఇచ్చిన వివరణతో కోర్టు ఏకీభవించింది. తమ శరీరానికి సంబంధించి ఎలాంటి నిర్ణయమైనా స్వతంత్రంగా తీసుకునే హక్కు ప్రతి మహిళకు ఉందని కేరళ హైకోర్ట్ స్పష్టం చేసింది. అలా ఉండటం వారికి రాజ్యాంగం 21వ అధికరణ కింద లభించిన వ్యక్తిగత స్వేచ్ఛ పరిధిలోకి వస్తుందని తేల్చి చెప్పింది. అంతేకాదు, నగ్నత్వం, అశ్లీలత రెండూ వేరుని కామెంట్ చేసింది.