Last Updated:

Akkineni Naga Chaitanya : నాగ చైతన్య కొత్త ఇంటికి ఫస్ట్ గెస్టుగా ఎవరు వెళ్లారో తెలుసా..?

అక్కినేని వారసుడు నాగ చైతన్య అంటే తెలియని వారుండరు. జోష్ సినిమాతో పరిచయం అయినా.. తక్కువ సమయం లోనే తండ్రి కి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన టాలెంట్ తో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్నాడు.

Akkineni Naga Chaitanya : నాగ చైతన్య కొత్త ఇంటికి ఫస్ట్ గెస్టుగా ఎవరు వెళ్లారో తెలుసా..?

Akkineni Naga Chaitanya : అక్కినేని వారసుడు నాగ చైతన్య అంటే తెలియని వారుండరు. జోష్ సినిమాతో పరిచయం అయినా.. తక్కువ సమయం లోనే తండ్రి కి తగ్గ కొడుకు అనిపించుకున్నాడు. తనదైన శైలిలో వరుస సినిమాల్లో నటిస్తూ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్నాడు. తన టాలెంట్ తో ఎన్నో హిట్ సినిమాలను అందుకున్నాడు. ఇక ఏం మాయ చేసావే సినిమాతో ఏర్పడిన సమంత – నాగ చైతన్యల పరిచయం.. అనంతరం ప్రేమగా మారి.. పెద్దల సమక్షంలో ఘనంగా పెళ్లి చేసుకున్నారు. అయితే వీళ్ళ ప్రేమ బంధం ఎక్కువ రోజులు నిలవలేదు. పెళ్ళైన 4 ఏళ్లకే విడాకులు తీసుకున్నారు. దీంతో నాగ చైతన్య ఎక్కువగా వార్తల్లో నిలిచాడు. ఇక ఇటీవల నాగ చైతన్య పర్సనల్ లైఫ్ గురించి అనేక వార్తలు వస్తున్నాయి. సమంతతో విడిపోయిన తర్వాత చైతు ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే.

వివాహం తర్వాత నాగ చైతన్య, సమంత.. మురళీమోహన్ కి చెందిన ఫ్లాట్ ని కొనుక్కుని అందులో ఉన్నారు. విడిపోయాక చైతు ఆ ఫ్లాట్ ని సమంతకి విడిచిపెట్టి నాగార్జున ఇంట్లో ఉన్నాడట. అయితే చైతు ఎప్పటి నుంచో తన అభిరుచికి తగ్గట్లుగా మోడ్రన్ గా ఉండే మంచి ఇంటిని నిర్మించుకోవాలని అనుకునేవాడట. నాగార్జున ఇంటికి దగ్గర్లోనే ఒక స్థలం కొని చకచకా ఒక లగ్జరీ ఇంటిని నిర్మించుకున్నాడట. ఈ మేరకు నాగార్జున ఇంటికి దగ్గరలో ఉన్న ఓ ఖాళీ స్థలంలో తన అభిరుచికి తగ్గట్లుగా లగ్జరీ హౌస్ ని నిర్మించుకున్నాడు. అందులో  స్విమ్మింగ్ పూల్, అందమైన గార్డెన్, జిమ్, థియేటర్ ఉండేలా  విలాసవంతమైన ఇంటిని రెడీ చేసుకున్నాడని తెలుస్తుంది.

ఉగాది సందర్భంగా నాగ చైతన్య హడావిడి, ఆర్భాటం లేకుండా సింపుల్ గా తన కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం చైతు ఆ ఇంట్లోనే ఉంటున్నట్లు తెలుస్తోంది. అయితే బుధవారం ఉగాది సందర్భంగా నాగ చైతన్య ఇంట్లోకి ఊహించని అతిథి వెళ్లారు. మొదటి అతిథిని చూసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ ఫీల్ అవుతున్నారు. అతనెవరో కాదు రీసెంట్ గా పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన డైరెక్టర్ చందూ ముండేటి. నాగ చైతన్య ఇంట్లో మొదటి అతిథి అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయి ఉండాలి కదా.. చందూ ముండేటి ఏంటి అని అంతా ఆశ్చర్యపోతున్నారు. చందూ ముండేటికి, నాగ చైతన్యకి మంచి సాన్నిహిత్యం ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో సవ్యసాచి అనే చిత్రం వచ్చింది. ఆ మూవీ నిరాశపరిచినప్పటికీ చై, చందూ మధ్య ఫ్రెండ్ షిప్ కొనసాగుతోంది. నాగ చైతన్య కొత్త ఇంటిని విజిట్ చేయడంపై చందూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘ఉగాది రోజు యువసామ్రాట్ కొత్త ఇంట్లో.. మొదటి అతిథిని నేనే .. కంగ్రాట్స్ నాగ చైతన్య ‘అని చందూ పోస్ట్ పెట్టారు. కొత్త ఇంట్లో చైతుతో కలసి దిగిన పిక్ ని షేర్ చేయగా అది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

 

View this post on Instagram

 

A post shared by Chandoo Mondeti (@chandoo.mondeti)

కొత్త ఇల్లు, కొత్త తెలుగు సంవత్సరంలో నాగ చైతన్యకి బాగా కలసి రావాలని ఫ్యాన్స్ విష్ చేస్తున్నారు. అంతే కాదు చందూ ముండేటి, నాగ చైతన్య కాంబినేషన్ లో సినిమా రావాలని కూడా ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ప్రస్తుతం అక్కినేని నాగ చైతన్య వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘కస్టడీ’ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ చిత్ర షూటింగ్ పూర్తయింది. మే 12న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీలో కృతి శెట్టి హీరోయిన్ గా నటించనుండగా.. బంగార్రాజు తర్వాత రెండో సారి వీళ్ళిద్దరూ కలిసి నటిస్తున్నారు.