Last Updated:

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరుగనున్న చార్జీలు

త్యం ఉరుకుల పరుగుల జీవితం సాగించే హైదరాబాద్ ప్రజలు చాలా మంది మెట్రోపై ఆధారిపై ఉంటారు. తక్కువ ధరకు అతితక్కువ సమయంలో ట్రాఫిక్ ఆటంకం లేకుండా చాలా మంది ఈ మెట్రో ద్వారా ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే తాజాగా ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది మెట్రో యాజమాన్యం. త్వరలోనే మెట్రోరైలు చార్జీలను పెంచనుంది.

Hyderabad Metro: మెట్రో ప్రయాణికులకు షాక్.. పెరుగనున్న చార్జీలు

Hyderabad Metro: నిత్యం ఉరుకుల పరుగుల జీవితం సాగించే హైదరాబాద్ ప్రజలు చాలా మంది మెట్రోపై ఆధారిపై ఉంటారు. తక్కువ ధరకు అతితక్కువ సమయంలో ట్రాఫిక్ ఆటంకం లేకుండా చాలా మంది ఈ మెట్రో ద్వారా ప్రయాణాలు సాగిస్తుంటారు. అయితే తాజాగా ప్రయాణికులకు షాకింగ్ న్యూస్ చెప్పింది మెట్రో యాజమాన్యం. త్వరలోనే మెట్రోరైలు చార్జీలను పెంచనుంది. చార్జీలను పెంచాలన్న హైదరాబాద్ మెట్రో అభ్యర్థనను పరిగణనలోకి తీసుకున్న కేంద్ర ప్రభుత్వం ఫేర్ ఫిక్స్‌డ్ కమిటీ (ఎఫ్ఎఫ్‌సీ)ని ఏర్పాటు చేసింది.

మెట్రో చార్జీల సవరణకు సంబంధించిన తమ అభిప్రాయాలను, సలహాలు, సూచనలను నవంబరు 15లోగా తెలపాలని ప్రయాణికులను ఎఫ్ఎఫ్సీ కోరింది. ఈమెయిల్ అడ్రస్ ffchmrl@gmail.com ద్వారా కానీ, చైర్మన్, ఫేర్ ఫిక్సేషన్ కమిటీ, మెట్రో రైలు భవన్, బేగంపేట, 500003 అడ్రస్‌కు పోస్ట్ ద్వారా కానీ ప్రయాణికులు తమ అభిప్రాయాలను పంపాలని కమిటీ సూచించింది. కాగా సాధారణంగా అయితే మెట్రో రైలు చార్జీలు పెంచే అధికారం మెట్రో రైలు అడ్మినిస్ట్రేషన్ (ఎంఆర్ఏ)కు రైలు సేవలు ప్రారంభించిన తొలిసారి మాత్రమే ఉంటుంది. ఆ తర్వాత వాటిని సవరించే అధికారం ఎంఆర్ఏకు ఉండదు. కేంద్రం నియమించే ఫేర్ ఫిక్సేషన్‌ కమిటీకే ఆ అధికారం ఉంటుంది.

అయితే మెట్రో చార్జీలను ఏ మేరకు పెంచాలన్నది ఇంకా నిర్ణయించలేదని హైదరాబాద్ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. కాగా, మెట్రో రైలులో ప్రస్తుతం కనిష్ఠ చార్జీ రూ. 10 కాగా, గరిష్ఠ చార్జీ 60 రూపాయలుగా ఉంది.

ఇదీ చదవండి: “కేసీఆర్ పచ్చి అబద్దాలకోరు.. ఓటమి భయంతోనే అలా”.. కిషన్ రెడ్డి సంచలన కామెంట్స్

ఇవి కూడా చదవండి: