Harish Shankar : పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి భీభత్సమైన గుడ్ న్యూస్ చెప్పిన హరీష్ శంకర్.. ఎన్నాళ్ళో వేచిన ఉదయం ఈరోజే ఎదురైందంటూ
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ దర్శకులలో హరీష్ శంకర్ కూడా ఒకరు. షాక్ సినిమాతో దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన మిరపకాయ్ భారీ హిట్ సాధించి హరీష్ శంకర్‌ను స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్.. భారీ హిట్ సాధించిన దబాంగ్ సినిమా

Harish Shankar : తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న ప్రముఖ దర్శకులలో హరీష్ శంకర్ కూడా ఒకరు. షాక్ సినిమాతో దర్శకుడిగా మారిన హరీష్ శంకర్ ప్రేక్షకుల్లో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత చేసిన మిరపకాయ్ భారీ హిట్ సాధించి హరీష్ శంకర్‌ను స్టార్ డైరెక్టర్‌గా నిలబెట్టింది. ఇక పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో తీసిన గబ్బర్ సింగ్.. భారీ హిట్ సాధించిన దబాంగ్ సినిమా రీమేక్ అయినప్పటికీ తెలుగులో ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. ఈ సినిమాలో పవన్ కి తగ్గట్టు హరీష్ చేసిన మార్పులు, టేకింగ్ ఏ అంతటి విజయానికి కారణం అని చెప్పాలి. కాగా 2019లో వచ్చిన ‘గద్దలకొండ గణేష్’ తర్వాత మరే చిత్రం చేయలేదన్న విషయం తెలిసిందే.
అయితే గ్యాప్ తీసుకున్నప్పటికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో సినిమా ప్రకటించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చి ఫ్యాన్స్ ని ఫుల్ ఖుషి చేశాడు హరీశ్ శంకర్. దాదాపు పదేండ్ల తర్వాత మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అవ్వడంతో పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతగానో ఖుషీ అవుతున్నారు. గతేడాది డిసెంబర్ 11న గ్రాండ్ గా పూజా కార్యక్రమాలు జరిగిన విషయం తెలిసిందే. మొదట ఈ సినిమాకి భవదీయుడు భగత్ సింగ్ అనే టైటిల్ ఫిక్స్ చేయగా.. తర్వాత టైటిల్ ని మార్చి ఉస్తాద్ భగత్ సింగ్ అని ఖరారు చేశారు. అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వరుస సినిమాలతో బిజీగా ఉండడంతో ఈ చిత్రం పట్టాలెక్కడం ఆలస్యం అవుతూ వస్తుంది. ఇక రీసెంట్ గా పవన్ కళ్యాణ్ ‘వినోదయ సీతమ్’ షూటింగ్ పూర్తి చేసుకోవడంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై ఫోకస్ పెట్టారు.
ఇప్పుడు తాజాగా హరీష్ శంకర్ పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈరోజు షూటింగ్ ప్రారంభం అవుతుందని సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ మేరకు ట్విట్టర్ లో ఆయన చేసిన ట్వీట్ చూస్తే ఆనందంతో పాటు నవ్వు కూడా రావడం పక్కా అనిపిస్తుంది. ఆ ట్వీట్ లో.. ఎట్టేకేలకు ‘ఉస్తాద్ భగత్ సింగ్ రోజు వచ్చేసింది’ అంటూ తన సంతోషాన్ని ‘ఏన్నాళ్లో వేచిన ఉదయం’ అనే సాంగ్ తో వ్యక్తం చేశారు. ఫైనల్ గా ఈ రోజు చిత్రం షూటింగ్ ప్రారంభిస్తుండటంతో పవన్ ఫ్యాన్స్ తో పాటు హరీశ్ శంకర్ పట్టలేని ఆనందంలో ఉన్నారు. ఈరోజు ఉదయం పవన్ కళ్యాణ్ ఉస్తాద్ భగత్ సింగ్ రెగ్యూలర్ షూటింగ్ లో పాల్గొన్నారు. హైదరాబాద్ లో ఇప్పటికే ఏర్పాటు చేసిన భారీ ఇంటి సెట్ లో షూటింగ్ మొదలైనట్టు తెలుస్తోంది. స్టార్ హీరోయిన్ పూజా హెగ్దే పవన్ సరసన నటించబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే యంగ్ బ్యూటీ శ్రీలీలా కూడా ఈ చిత్రంలో చేస్తున్నట్లు సమాచారం. దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
And the Day has arrived !!!!!! #UstaadBhagathSingh pic.twitter.com/bkXFUjyM2r
— Harish Shankar .S (@harish2you) April 5, 2023
ఇవి కూడా చదవండి:
- Donald Trump Arrest : ఆ కేసులో అరెస్ట్ అయిన డొనాల్డ్ ట్రంప్.. అమెరికా చరిత్ర లోనే తొలిసారి
- Daggubati Mohan Babu : దగ్గుబాటి కుటుంబంలో తీవ్ర విషాదం.. తుదిశ్వాస విడిచిన దగ్గుబాటి మోహన్ బాబు
- Mrunal Thakur : బీచ్ లో బికినీతో వయ్యారాలు ఒలకబోస్తున్న సీతారామం బ్యూటీ “మృణాల్ ఠాకూర్”..