Banks: డిసెంబర్లో 14 రోజులు సెలవులు
డిసెంబర్ నెల ప్రారంభం అవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల వివరాలను ఆర్బీఐ ప్రకటించింది. డిసెంబర్లో బ్యాంక్‌లకు 14 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి.
Banks: డిసెంబర్ నెల ప్రారంభం అవడానికి ఇంకా కొన్ని రోజులు మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో డిసెంబర్ నెలకు సంబంధించిన బ్యాంక్ సెలవుల వివరాలను
ఆర్బీఐ ప్రకటించింది. డిసెంబర్లో బ్యాంక్‌లకు 14 రోజుల పాటు సెలవులు ఉండనున్నాయి. అయితే వీటిల్లో కొన్ని ప్రాంతీయ సెలవులు కూడా ఉన్నాయి.
ఇక బ్యాంకు ఖాతాదారాలు ఈ లిస్ట్‌ను గుర్తించి సెలవు లేని రోజు చూసుకుని బ్యాంక్‌కు వెళ్లాల్సి ఉంటుంది.
ప్రాంతీయ సెలవుల వివరాలు..
డిసెంబర్ 3: ఫీస్ట్ ఆఫ్ సెంట్ జేవియర్స్. గోవా బ్యాంక్‌లకు సెలవు
డిసెంబర్ 12: పా టోగాన్ నెంగ్మింజా సంగ్మ. షిల్లాంగ్‌లో బ్యాంక్‌లకు సెలవు
డిసెంబర్ 19: గోవా లిబరేషన్ డే. గోవా బ్యాంక్‌లకు సెలవు
డిసెంబర్ 24: క్రిస్ట్మస్ ఈవ్. షిల్లాంగ్ బ్యాంక్‌లకు సెలవు
డిసెంబర్ 26: క్రిస్ట్మస్ సెలబ్రేషన్స్/లూసాంగ్/నామ్‌సాంగ్- ఐజాల్, గ్యాంగ్‌టక్, షిల్లాంగ్ బ్యాంక్‌లకు సెలవు
డిసెంబర్ 29: గురు గోబింద్ సింగ్ జయంతి. ఛండీగడ్ బ్యాంక్‌లకు సెలవు
డిసెంబర్ 30: యూ కియాంగ్ నంగ్బాఘ్. షిల్లాంగ్ బ్యాంక్‌లకు సెలవు
డిసెంబర్ 31: న్యూ ఈయర్ ఈవ్, ఐజాల్ బ్యాంక్‌లకు సెలవు
సాధారణ సెలవులు..
డిసెంబర్ 4: ఆదివారం
డిసెంబర్ 10: రెండో శనివారం
డిసెంబర్ 11: ఆదివారం
డిసెంబర్ 18: ఆదివారం
డిసెంబర్ 24: నాలుగో శనివారం
డిసెంబర్ 25: క్రిస్ట్మస్, ఆదివారం
ఇదీ చదవండి: ట్వీట్ సైజ్‌ను పెంచనున్న ట్విట్టర్