Twitter: ట్వీట్ సైజ్‌ను పెంచనున్న ట్విట్టర్
ఒక సమాచారాన్ని షాట్ అండ్ స్వీట్ గా ప్రజలకు తెలియజేసే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో దిగ్గజ సంస్థగా ట్విట్టర్ కు మంచి పాప్యులారిటీ ఉంది. అలాంటి ట్విట్టర్లో ఒక ట్వీట్ లో 280 క్యారెక్టర్ల వరకు టైప్ చేసే వెసులుబాటు ఉంది. కాగా ఈ పరిమితిని 420కు పెంచే అవకాశం ఉంది.
Twitter: ఒక సమాచారాన్ని షాట్ అండ్ స్వీట్ గా ప్రజలకు తెలియజేసే సోషల్ మీడియా ప్లాట్ ఫాంలలో దిగ్గజ సంస్థగా ట్విట్టర్ కు మంచి పాప్యులారిటీ ఉంది. అయితే ఈ ట్విట్టర్ లో కొత్త యజమాని ఎలాన్ మస్క్ సారథ్యంలో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చు. ట్విట్టర్ ను మరింత చురుకైన, మెరుగైన వేదికగా మార్చాలని మస్క్ విపరీతమైన ప్రయత్నం చేస్తున్నారని సమాచారం. అందులో భాగంగా ట్వీట్ లో అక్షరాల పరిమితిని పెంచనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఒక ట్వీట్ లో 280 క్యారెక్టర్ల వరకు టైప్ చేసే వెసులుబాటు ఉంది. కాగా ఈ పరిమితిని 420కు పెంచే అవకాశం ఉంది. దీనివల్ల యూజర్లు తమ భావాలను మరింత వివరంగా చెప్పే వీలు కలుగుతుంది.
‘‘మస్క్ ట్విట్టర్ 2.0లో తప్పకుండా క్యారెక్టర్ల పరిమితిని 280కు బదులు 420 చేయాలి’’ అంటూ ఓ ట్విట్టర్ యూజర్ ట్వీట్ చెయ్యగా దానికి మస్క్ స్పందిస్తూ మంచి ఆలోచన అంటూ సమాధానం ఇచ్చారు. దానితో త్వరలోనే ఈ కొత్త అప్డేట్ ను అందుబాటులోకి తీసుకురానున్నట్టు నెట్టింట ప్రచారం జరుగుతుంది. ఇదిలా ఉంటే ట్విట్టర్ ఆరంభంలో 140 క్యారెక్టర్లనే ఒక ట్వీట్ లో అనుమతించగా క్రమంగా 2018లో దీన్ని 280 క్యారెక్టర్లకు పెంచింది. ఇప్పుడది తర్వలో 420 క్యారెక్టర్లకు మారనుందని తెలుస్తోంది.
Good idea
— Elon Musk (@elonmusk) November 27, 2022
ఇకపోతే ఇప్పటికే సస్పెండ్ అయిన ట్విట్టర్ ఖాతాలకు మస్క్ సాధారణ క్షమాభిక్షను ప్రకటిస్తూ వస్తున్నారు. జీవిత కాలం నిషేధానికి గురైన అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ ఖాతాతో పాటు పలువురి అకౌంట్లను పునరుద్ధరించారు. అంతే కాకుండా త్వరలోనే సెలబ్రిటీలు కంగనా రనౌత్, ఆమె సోదరి రంగోలి చందేల్, గాయకుడు అభిజీత్ బెనర్జీ తదితరులు మళ్లీ ట్విట్టర్ లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.
ఇదీ చదవండి: స్మార్ట్ ఫోన్ తయారీకి మస్క్ మొగ్గు.. యాపిల్, గూగుల్‌కు వార్నింగ్