Last Updated:

Bandi Sanjay : తీన్మార్ మల్లన్న అరెస్టుపై బండి సంజయ్ ఫైర్.. ఎత్తుకెళ్లింది పోలీసులా? గూండాలా? అంటూ

ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో గత రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు అనంతరం ఆయనతో పాటు తెలంగాణ విఠల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడాన్ని

Bandi Sanjay : తీన్మార్ మల్లన్న అరెస్టుపై బండి సంజయ్ ఫైర్.. ఎత్తుకెళ్లింది పోలీసులా? గూండాలా? అంటూ

Bandi Sanjay : ప్రముఖ జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.  తీన్మార్ మల్లన్న క్యూ న్యూస్ కార్యాలయంలో గత రాత్రి సోదాలు నిర్వహించిన పోలీసులు అనంతరం ఆయనతో పాటు తెలంగాణ విఠల్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. తీన్మార్ మల్లన్నను అదుపులోకి తీసుకోవడాన్ని తెలంగాణ బీజేపీ తీవ్రంగా ఖండించింది. అరెస్ట్ చేసిన వారిని వెంటనే వదిలిపెట్టాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.. మల్లన్న కుటుంబాన్ని కలిసి పరామర్శించారు.

తప్పు చేస్తే కేసులు పెట్టి శిక్షించాలి.. దొంగలా ఎత్తుకుపోవడం ఏంటి- బండి సంజయ్ (Bandi Sanjay)

ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ రాజకీయ పార్టీలా కాకుండా గూండా పార్టీలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. క్యూ న్యూస్ ఆఫీస్‌పై దాడిచేసి కంప్యూటర్లు ఎత్తుకుపోవడం దుర్మార్గమన్నారు. తనకు విషయం తెలిసిన వెంటనే తీన్మార్ మల్లన్న, విఠల్ ఇంటికి వచ్చినట్టు చెప్పారు. ప్రశ్నించే గొంతులను అణచివేయడం ద్వారా కేసీఆర్ తన గొయ్యిని తానే తవ్వుకుంటున్నారని అన్నారు. మీడియా కూడా కేసీఆర్ ఒత్తిడితోనే పనిచేస్తోందని, మీడియా ఏదైనా ప్రజలు దానిని విశ్వసించడం లేదని అన్నారు. తీన్మార్ మల్లన్న కార్యాలయంపై సోదాలు, దాడి విషయాన్ని హైలైట్ చేయకపోవడానికి అదే కారణమన్నారు. తీన్మార్ మల్లన్న తప్పు చేస్తే కేసులు పెట్టి శిక్షించాలని.. అంతేకానీ దొంగలా ఎత్తుకుపోవడం ఏంటని బండి సంజయ్ ప్రశ్నించారు.

టీఎస్‌పీఎస్సీ విషయంలో కేటీఆర్ హస్తం ఉందని తీన్మార్ మల్లన్న చెబుతున్నందుకే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. అరెస్ట్ చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని, లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని బండి సంజయ్ హెచ్చరించారు. తీన్మార్ మల్లన్నను ఎత్తుకెళ్లింది పోలీసులా? గూండాలా? స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. కాగా ఆదివారం కొందరు వ్యక్తులు కార్యాలయంలోకి ప్రవేశించి ఫర్నిచర్, కంప్యూటర్లను ధ్వంసం చేశారు. దీనిపై తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. సిబ్బందితో కలిసి రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే.

ఇకపోతే ఉమ్మడి నల్గొండ జిల్లా భువనగిరి సమీపంలోని మాదాపూర్ గ్రామానికి చెందిన నవీన్ కుమార్ వి6 లో ఉద్యోగానికి  రాజీనామా చేసి తెలంగాణ ఏర్పడ్డాక నల్గొండ – ఖమ్మం – వరంగల్ స్థానానికి జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలయ్యారు. రెండేళ్ల క్రితం జరిగిన నల్గొండ – వరంగల్ – ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన తీన్ మార్ మల్లన్న హోరాహోరీగా పోరాడి ఏకంగా టీఆర్ఎస్ నేత పల్లా రాజేశ్వర్ రెడ్డి చేతుల్లో స్వల్ప మెజార్టీ తేడాతో ఓడిపోయారు.