Today Panchangam : నేటి (మార్చి 22, బుధవారం) పంచాంగం వివరాలు..
హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో ఫాల్గుణ శుద్ధ మాసంలో నేటి (మార్చి 22 ) బుధవారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..
రాష్ట్రీయ మితి ఛైత్రం 01 , శాఖ సంవత్సరం 1944, ఫాల్గుణ మాసం, శుక్ల పక్షం, పాడ్యమి తిథి, విక్రమ సంవత్సరం 2079. షబ్బన్ 29, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 22 మార్చి 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1: 30 గంటల వరకు. పాడ్యమి తిథి ఉదయం 8:22 గంటల వరకు, ఆ తర్వాత తదియ తిథి ప్రారంభమవుతుంది. ఈరోజు ఉత్తరాభాద్రపద నక్షత్రం మధ్యాహ్నం 3:32 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత రేవతి నక్షత్రం ప్రారంభమవుతుంది. ఆరోజు ఉదయం 9:17 గంటల వరకు శుక్ల యోగం ఉంటుంది. ఆ తర్వాత బ్రహ్మయోగం ప్రారంభమవుతుంది. ఈరోజు చంద్రుడు మీన రాశిలో పగలు, రాత్రి సంచారం చేయనున్నాడు.
నేటి ఉపవాస పండుగ : ఉగాది పండుగ, నవరాత్రులు ప్రారంభం, దుర్గా మాత పూజ ప్రారంభం
సూర్యోదయం సమయం 22 మార్చి 2023 : ఉదయం 6:23 గంటలకు
సూర్యాస్తమయం సమయం 22 మార్చి 2023 : సాయంత్రం 6:33 గంటలకు
నేడు శుభ ముహుర్తాలివే (Today Panchangam)..
విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:19 గంటల వరకు
నిశిత కాలం : అర్ధరాత్రి 12:04 గంటల నుంచి రాత్రి 12:51 గంటల వరకు
సంధ్యా సమయం : సాయంత్రం 6:32 గంటల నుంచి సాయంత్రం 6:56 గంటల వరకు
అమృత కాలం : ఉదయం 11:07 గంటల నుంచి మధ్యాహ్నం 12:35 గంటల వరకు
(Today Panchangam) నేడు అశుభ ముహుర్తాలివే..
రాహూకాలం : మధ్యాహ్నం 12 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 గంటల వరకు
గులిక్ కాలం : ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు
యమగండం : ఉదయం 7:30 గంటల నుంచి ఉదయం 9 గంటల వరకు
దుర్ముహర్తం : మధ్యాహ్నం 12:04 గంటల నుంచి మధ్యాహ్నం 12:53 గంటల వరకు
ఈరోజంతా పంచక్ కాలం ఉంటుంది.
నేటి పరిహారం : ఈరోజు దుర్గాదేవిని స్తుతించాలి. దుర్గా సప్తశతిని పఠించాలి.
ఇవి కూడా చదవండి:
- Delhi liquor Scam: ముగిసిన కవిత విచారణ.. ప్రధానంగా ఇదే అంశంపై చర్చ
- WPL 2023: ఆర్సీబీకి తప్పని నిరాశ.. ఓటమితో ముగింపు
- Delhi Liquor Scam: 8 గంటలుగా విచారణ.. ఈడీ ఆఫీస్కు కవిత లీగల్ టీం