Last Updated:

AP employees: 50శాతం ఏపీ ఉద్యోగులకు అందని జీతాలు

నెలపుట్టి మూడు రోజులు అవుతున్నా జీతం కోసం 50 నుండి 60శాతం మంది ఏపి ఉద్యోగులు, ఫింక్ఛన్ దారులు ఎదురు చూపులు చూస్తున్నారు. పండుగ పూట కూడ జేబులు వెతుక్కొనే పరిస్ధితులు చాలా మందికి ఏర్పడింది.

AP employees: 50శాతం ఏపీ ఉద్యోగులకు అందని జీతాలు

Salaries: దసరా పండుగ వచ్చేసింది. అయినా పండుగ చేసుకొనేందుకు చాలా మంది ఏపీ ఉద్యోగుల వద్ద డబ్బులు కట కటా అంటున్నాయి. ఈ నెలలో బ్యాంకులో పడాల్సిన జీతం డబ్బులు ఇంకా ప్రభుత్వం ట్రాన్స్ఫర్ చేయలేదు. నెలపుట్టి మూడు రోజులు అవుతున్నా జీతం కోసం 50 నుండి 60శాతం మంది ఉద్యోగులు, ఫింక్ఛన్ దారులు ఎదురు చూపులు చూస్తున్నారు. పండుగ పూట కూడ జేబులు వెతుక్కొనే పరిస్ధితులు చాలా మందికి ఏర్పడింది.

నెల నెలా వచ్చిన జీతం కాస్తా ఇఎంఐలు, పిల్లల చదువుల, ఇతరత్రా రుణాలకే సరిపోతుంది. అది కూడా జీతం డబ్బులు సక్రమంగా పడితేనా ఇదంతా జరిగేది. ఒక వేళ జీతం డబ్బులు ఆలస్యంగా వస్తే, పెనాల్టీ కింద బ్యాంకులు, లోన్ సంస్ధలు నిలబెట్టి లేట్ పేమెంట్ పేరుతో ముక్కు పిండి మరీ వసూలు చేస్తున్నాయి. దీంతో ఉద్యోగులు దశరా జీతాలు కోసం పరేషాన్ అవుతున్నారు.

ఈ దినం సెక్యూరిటీ బాండ్ల వేలంతో ఏపీ ప్రభుత్వం రెండు వేల కోట్లు రుణం రిజర్వు బ్యాంకు నుండి అప్పుగా తీసుకొనింది. బహుశా మంగళవారం సాయంత్రం లోపు వేతనాలు పడతాయని ఉద్యోగులు భావిస్తున్నారు. ప్రతి నెల జీతాలకు, ఫింక్ఛన్లకు దాదాపుగా రూ. 5500కోట్లు ప్రభుత్వానికి అవసరం పడుతుంది. నిధులు లేమితో వేతనాలు ఆలస్యం అవుతున్నాయి.

పేదల సంక్షేమమే వైకాపా ప్రభుత్వంగా చెప్పుకొంటున్నారే కాని, నెల పుడితే ఉద్యోగులకు జీతం డబ్బులు ఠంచన్ గా వారి వారి బ్యాంకు ఖాతాలకు బదిలీలో మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అష్టకష్టాలు పడుతుంది.

ఇది కూడా చదవండి:AndhraPradesh: 6నెలల్లో రూ.51608 కోట్లు అప్పుగా తెచ్చిన ఏపీ ప్రభుత్వం

ఇవి కూడా చదవండి: