Last Updated:

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్.. బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

Jani Master: జానీ మాస్టర్‌కు మరో షాక్.. బెయిల్‌ పిటిషన్‌ కొట్టివేత

Another big shock for Jani Master: ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు మరో షాక్ తగిలింది. జానీ మాస్టర్ బెయిల్‌ పిటిషన్‌ను రంగారెడ్డి జిల్లా కోర్టు కొట్టివేసింది. గతంలో ఆయన వద్ద పనిచేసిన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ రేప్ కేసు పెట్టింది. తాను మైనర్ గా ఉన్నప్పుడే తనను బలవంతం చేశాడని, ముంబైలో రేప్ చేశాడని కేసు పెట్టడంతో జానీ మాస్టర్ మీద ఫోక్సో చట్టం సహా పలు రేప్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలోనే ఆయనని ప్రస్తుతం అరెస్టు చేసి హైదరాబాద్ చర్లపల్లి జైల్‌లో రిమాండ్ ఖైదీగా ఉంచారు.

ఈ కేసులో బెయిల్ కోసం జానీ మాస్టర్ కోర్టును ఆశ్రయించారు. అయితే కోర్టు ఆయన బెయిలు తిరస్కరించింది. గతంలో తాను నేషనల్ అవార్డు అందుకోవాల్సి ఉందని బెయిల్ కోసం దరఖాస్తు చేయగా ఆయనకు బెయిల్ మంజూరైంది. అయితే నేషనల్ అవార్డు రద్దు కావడంతో ఆయన బెయిల్ కూడా రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ కేసులో సాధారణ బెయిల్ ఇవ్వాలని ఆయన కోరగా కోర్టు అందుకు అంగీకరించలేదు.