Last Updated:

California Reservoirs: మూడేళ్ల తరువాత కళకళలాడుతున్న కాలిఫోర్నియా రిజర్వాయర్లు

గత కొద్దికాలంగా సంభవించిన వరుత తుపాన్లతో కాలిఫోర్నియాలోని 17 ప్రధాన రిజర్వాయర్‌లలో 12 వాటి చారిత్రక సగటు కంటే ఎక్కువగా నిండి ఉన్నాయి. తుఫానులకు ముందు, కాలిఫోర్నియా కరువు తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో కీలకమైన రిజర్వాయర్లలో నీటి స్థాయిలు చాలా తక్కువగా పడిపోయాయి.

California Reservoirs: మూడేళ్ల తరువాత  కళకళలాడుతున్న కాలిఫోర్నియా రిజర్వాయర్లు

California Reservoirs: గత కొద్దికాలంగా సంభవించిన వరస తుపాన్లతో కాలిఫోర్నియాలోని 17 ప్రధాన రిజర్వాయర్‌లలో 12 వాటి చారిత్రక సగటు కంటే ఎక్కువగా నిండి ఉన్నాయి. తుఫానులకు ముందు, కాలిఫోర్నియా కరువు తీవ్రస్థాయిలో ఉన్న సమయంలో కీలకమైన రిజర్వాయర్లలో నీటి స్థాయిలు చాలా తక్కువగా పడిపోయాయి. పగిలిన భూమిపై పడవలు నిలిపే పరిస్దితి ఏర్పడింది ఫోల్సమ్ సరస్సు మధ్యలోకి కార్లు వెళ్లాయి. అయితే ఇపుడు పరిస్దితి పూర్తిగా మారింది.

తుఫాన్లతో భారీ వర్షాలు..(California Reservoirs)

కాలిఫోర్నియాలో తుఫానులు విజృంభించాయి. దీనితో రాష్ట్రంలోని ఉత్తర ప్రాంతం అంతటా మోస్తరు నుండి భారీ వర్షం మరియు మంచు కురిసింది. చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు, జోబైడెన్ ప్రభుత్వంఅత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇందులో అమెరికా నది వెంబడి నీటి ప్రవాహాలను నియంత్రించే ఫోల్సమ్ సరస్సు, అలాగే రాష్ట్రంలోని రెండవ అతిపెద్ద రిజర్వాయర్ మరియు దేశంలోని అత్యంత ఎత్తైన ఆనకట్టకు నిలయం అయిన ఒరోవిల్ సరస్సు కూడా ఉన్నాయి.

డిసెంబర్ నుంచి మారిన పరిస్దితి..

గత సంవత్సరం చివరలో కాలిఫోర్నియాలో తీవ్ర కరువు పరిస్దితులు ఏర్పడ్డాయి. . బావులు ఎండిపోయాయి. రైతులు సాగునీటికి ఇబ్బందిపడ్డారు. గడ్డికి నీరు పెట్టడానికి పరిమితం అయ్యారు. కానీ ఇప్పుడు నీటి లభ్యత అద్భుతంగా మారడంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది.డిసెంబరులో నీటి చిత్రం ఒక్కసారిగా మారిపోయింది. జనవరిలో కాలిఫోర్నియా మూడు పొడి సంవత్సరాల నుండి రికార్డు స్థాయిలో మూడు తడి వారాలకు చేరుకుంది” అని కాలిఫోర్నియా డిపార్ట్‌మెంట్ ఆఫ్ వాటర్ రిసోర్సెస్ డైరెక్టర్ కార్లా నెమెత్ అన్నారు, కాలిఫోర్నియా రాష్ట్రంలోని చాలా చిన్న ప్రాంతాలలో తప్ప కరువు లేదని అన్నారు. సియెర్రా పర్వతాలు మరియు సెంట్రల్ వ్యాలీలో వరదలకు కారణమయ్యే నీటి ప్రవాహాన్ని వదులుతున్నారు.ప్రస్తుత సమృద్ధి నీటిని వృధా చేయనివ్వవద్దని రాష్ట్ర అధికారులు నివాసితులను హెచ్చరిస్తున్నారు.